రియల్ ఎస్టేట్‌లో కంటెంట్ మార్కెటింగ్ పవర్ ఇదే.. (INDIAN REALTY)

By Krishna Adithya  |  First Published Jun 27, 2023, 2:05 PM IST

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ విధానం కూడా పెరిగింది.


ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే సాధారణంగా చాలా వరకు సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగించేవారు. ప్రధానంగా ప్రింటింగ్ యాడ్స్, బిల్ బోర్డ్స్, అలాగే కరపత్రాలు ఇలా పాత పద్ధతుల్లో మార్కెటింగ్ చేసేవారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త మార్కెటింగ్ టెక్నాలజీలు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించాయి. https://www.indianrealty.co/

కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి
రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. అయితే మార్కెటింగ్ చేయడం ద్వారానే ఈ రంగంలో రాణించగలం. ఇందులో కంటెంట్ మార్కెటింగ్ అనేది సృజనాత్మకమైన విలువైన పద్ధతి అని చెప్పవచ్చు. తద్వారా ఉద్దేశించిన కస్టమర్లకు చెప్పాలనుకున్న విషయం నేరుగా వెళుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కంటెంట్ మార్కెటింగ్ అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా బ్లాగ్ పోస్టులు, అలాగే సోషల్ మీడియా అప్డేట్స్, వీడియోస్ అలాగే మరిన్ని పద్ధతుల్లో ఇది సాగుతుంది.

Latest Videos

రియల్ ఎస్టేట్ రంగానికి కంటెంట్ మార్కెటింగ్ ఎంతవరకు దోహదపడుతుంది
ఒక రంగంలో ఎవరైనా లీడర్ గా ఎదగాలి అనుకుంటే ఆ రంగం గురించి ప్రతి ఒక్క విషయాన్ని అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు మీకు తెలిసిన విషయాన్ని చాలా సులువైన పద్ధతిలో పదిమందికి తెలిసేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆ రంగంలో పూర్తిస్థాయిలో నైపుణ్యాన్ని సైతం సాధించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మీ క్లయింట్లను సులభంగా రాబట్టుకోగలరు. అయితే సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు పెద్ద ఎత్తున క్లయింట్లను రాబట్టుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడం ద్వారా ఖర్చు వృధా అవుతుంది. అయితే కొత్త టెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి మీ క్లయింట్లను ఫ్లాట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేసేందుకు, వర్చువల్ టూర్  లాంటి టెక్నాలజీలను ఉపయోగిస్తే, మీ క్లయింట్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఎలాంటి కంటెంట్ మార్కెటింగ్ చేస్తే రియల్ ఎస్టేట్లో మంచిది
మీరు ఉద్దేశించినటువంటి టార్గెట్  ఆడియన్స్ వద్దకు చేరేలా వివిధ రకాల కంటెంట్ మార్కెటింగ్ వ్యూహాలను అప్లై చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మొదటిసారి ఇల్లు కొంటున్నటువంటి కస్టమర్లను టార్గెట్ చేస్తున్నట్లయితే వారిని ఆకట్టుకునేలా బ్లాక్ పోస్టులు అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫారంల ద్వారా ఇల్లు కొనుగోలు చేయమని సలహా ఇస్తూ ఉండాలి. ఒకవేళ మీరు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసే బయ్యర్లను టార్గెట్ చేసినట్లయితే వారికి అర్థమయ్యేలా హై క్వాలిటీ వీడియోలను వర్చువల్ టూర్లను ఏర్పాటు చేసి, మీరు విక్రయించదలచుకున్న ప్రాపర్టీస్ ను వారికి అర్థమయ్యేలా సులభంగా గ్రహించేలా  కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. 

కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రధానంగా గుర్తించవలసింది మీ టార్గెట్ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు రీసర్చ్, ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.  అలాగే మీ క్లయింట్లకు కావలసిన అవసరాలు అలాగే వారి ఇంట్రెస్ట్ ను గుర్తించి సరైన కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఈ రంగంలో రాణించవచ్చు. 

కంటెంట్ తయారీ అనేది మొదటి అడుగే అవ్వచ్చు, కానీ దాన్ని ఎంత సులభంగా ఎంత ప్రభావవంతంగా ప్రమోట్ చేస్తున్నాము అనేదే ప్రధానం అన్న విషయం గుర్తించాలి. అంటే మీరు తయారు చేసిన కంటెంట్ ప్రజల్లోకి ఎంత వెళుతుంది అన్నది గుర్తించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు సోషల్ మీడియాను అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసి తద్వారా క్యాంపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మీ సర్వీసును ప్రజల్లో తెలిసేలా ఈ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. 

చివరగా ఎన్ని మార్కెటింగ్ టెక్నాలజీలు  ఉపయోగించినప్పటికీ,  విజయం అనేదే ఇందుకు కొలమానం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మార్కెటింగ్ చేసినప్పటికీ చివరికి చెప్పాల్సి వచ్చేది ఎంత సక్సెస్ సాధించామో అదే కొలమానంగా నిలబడుతుంది. ఎంత వెబ్ ట్రాఫిక్ వచ్చినా సోషల్ మీడియా ద్వారా ఎంగేజింగ్ వచ్చినప్పటికీ అది ప్రజలకు ఏమేర చేరింది అనేది, మీరు సాధించిన విజయం పైనే ఆధారపడి ఉంటుంది. 

కంటెంట్ మార్కెటింగ్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఒక విప్లవం అనే చెప్పాలి.  మీరు క్రియేట్ చేసినటువంటి కంటెంట్ ప్రజల్లోకి  వెళ్లడం ద్వారా మీరు మార్కెట్లో ఒక లీడర్ గా అవకాశం అవతరించే అవకాశం ఉంది. అంతేకాదు కంటెంట్ మార్కెటింగ్ అనేది ప్రస్తుత కాలంలో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించే ఒక సాధనంగా చెప్పవచ్చు. ఇకపై వ్యాపారం ఏదైనాప్పటికీ కంటెంట్ మార్కెటింగ్ ద్వారా ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకుందాం.  (INDIAN REALTY) - https://www.indianrealty.co/

click me!