రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో భారత్‌కు జరిగిన లాభం ఇదే..ఏడాది పూర్తి చేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం..

Published : Feb 25, 2023, 02:11 AM IST
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో భారత్‌కు జరిగిన లాభం ఇదే..ఏడాది పూర్తి చేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం..

సారాంశం

ఉక్రెయిన్ యుద్ధం అనేక దేశాల్లో ద్రవ్యోల్బణానికి కారణం అయ్యింది, దాంతో పాటు యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. అయితే ఈ సంక్షోభ సమయంలో భారతీయ కంపెనీలు తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేశాయి. ఫలితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపనీలు లాభపడ్డాయి.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐరోపా దేశాల్లోనే కాదు, అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం పెరగడం పెను సంక్షోభాన్ని సృష్టించింది. యుద్ధం భారతదేశాన్ని కూడా పరోక్షంగా ప్రభావితం చేసింది. అయితే భారత ఆయిల్ కంపెనీలకు మాత్రం ఈ యుద్ధం బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆంక్షల కారణంగా రష్యా చమురును కొనే నాథుడు లేకపోవడంతో భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా రష్యా నుంచి చవకగా ముడి చమురును కొనుగోలు చేయడం వల్ల చమురు కంపెనీలు లాభపడ్డాయి.

ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో జరిగిన నష్టం ఇదే..
ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అధిక ధరలు,  ద్రవ్యోల్బణానికి నాంది పలికింది. ఐరోపా దేశాల్లో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. సహజవాయువు ధరలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. కోవిడ్ కారణంగా ఏర్పడిన ప్రపంచ మాంద్యం అమెరికాలోని పెద్ద కంపెనీలను సంక్షోభంలో పడేసింది. దీని తరువాత వచ్చిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేశాయి. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణం , నష్టాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. ఆహారధాన్యాల ధరలు, ముఖ్యంగా గోధుమల ధరలు గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. ప్రపంచంలోని గోధుమ ఉత్పత్తిలో 70 శాతం , సన్ ఫ్లవర్ నూనెలో మూడవ వంతు రష్యా , ఉక్రెయిన్ నుండి వస్తుంది. వస్తువుల తరలింపు ఆగిపోవడం , సరఫరా గొలుసుల అంతరాయం అనేక దేశాలలో ధరల పెరుగుదలను తీవ్రతరం చేశాయి.  నైజీరియాలో గోధుమల ధరలు 37 శాతం పెరిగాయి. భారతదేశంతో సహా దేశాలు ఉత్పత్తిని పెంచడం , చౌకగా ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరిన్ని ప్రయత్నాలు చేశాయి. 

ఉక్రెయిన్ యుద్ధం భారత్ కు ఇలా కలిసి వచ్చింది..
యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభ సమయంలో, రష్యా నుండి చౌకగా ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం లాభపడింది. చైనా కూడా ఈ విధంగా చమురు కొనుగోలు చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధర 100 డాలర్లకు పైబడి ఉన్నప్పుడు కూడా భారత కంపెనీలు రష్యా నుంచి 60 డాలర్లకు చమురును కొనుగోలు చేయగలిగాయి. భారతదేశం తక్కువ ధరలకు రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయగలిగాయి. గతేడాది కంటే ఇది 300 రెట్లు ఎక్కువ. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వంటి  ప్రయోజనాలను భారతీయులు పొందలేకపోయారు. అయితే భారతీయ చమురు కంపెనీల పాత నష్టాలను పూడ్చేందుకు వచ్చిన లాభాలను ఉపయోగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

గోధుమలు మాత్రమే కాదు, టైటానియం, నికెల్, అల్యూమినియం , ఎరువులు కూడా యుద్ధం  నేపథ్యంలో సరఫరా చెయిన్ దెబ్బతిన్నది. అయితే అంతకంటే ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే స్థాయికి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !