
మార్కెట్లో ఎన్నిరకాల లోన్స్ ఉన్నప్పటికీ బంగారు రుణాలు తీసుకునేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే బంగారాన్ని భారతీయులు ఆస్తిగా భావిస్తారు. అంతే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు బంగారం ఆదుకుంటుందని చాలా మంది నమ్మకం. బంగారు రుణాలను ఇచ్చేందుకు అటు బ్యాంకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం గోల్డ్ రుణాలను అత్యధికంగా ఇస్తుంటాయి. అయితే తాజాగా ఈ రంగంలోకి ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజ కోటక్ మహేంద్ర బ్యాంక్ సైతం గోల్డ్ లోన్ బిజినెస్ లో అడుగుపెట్టేందుకు భారీ ఎత్తున సిద్ధమవుతోంది.
డబ్బు అత్యవసరమైతే చాలా మంది తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రస్తుతం గోల్డ్ లోన్స్ సులభంగా లోన్ పొందే అవకాశం ఉన్న మార్గంగా చెప్పవచ్చు. బంగారం తనఖా రుణాలు, నేడు అత్యధిక డిమాండ్ ఉన్న రిటైల్ రుణాలుగా చెప్పవచ్చు.
డిమాండ్ పెరగడం వల్ల బంగారం తనఖా రుణాల కోసం ఆర్థిక సంస్థలు కూడా వివిధ సర్వీసులతో పోటీ పడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ 100 గోల్డ్ లోన్ బ్రాంచ్‌లతో గోల్డ్ లోన్ రంగంలో క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమవుతోంది.
కోటక్ మహీంద్రా మార్చి 2022 వరకు 400 గోల్డ్ లోన్ బ్రాంచ్‌ల ద్వారా గోల్డ్ లోన్‌లను అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 1000 గోల్డ్ లోన్ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కాగా ఇఫ్పటికే దేశంలోని 253 నగరాల్లో మొత్తం 500 బ్రాంచ్‌ల ద్వారా గోల్డ్ లోన్ రుణాలు అందజేస్తున్నారు. అలాగే, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 50 శాఖలను ప్రారంభించడం ద్వారా గోల్డ్ లోన్ బిజినెస్ లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గోల్డ్ లోన్ వ్యాపారాన్ని విస్తరించేందుకు, కొటక్ మహీంద్రా కస్టమర్లను ఆకర్షించేందుకు లావాదేవీలను మరింత కస్టమర్-ఫ్రెండ్లీగా చేయాలని కూడా యోచిస్తోంది. ఇందులో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాలకు బంగారం తనఖా చేసే సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లిస్తారు.ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు (9 శాతం నుండి ప్రారంభమవుతుంది), సులభంగా తిరిగి చెల్లించే ఎంపికలు, కనీస డాక్యుమెంటేషన్, వడ్డీ రేట్లలో పారదర్శకత వంటి సేవలకు కూడా హామీ ఇస్తుంది.
బంగారం ధర తరచూ పెరగడంతో దేశంలో బంగారం కొని ఇంట్లో పెట్టుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. వ్యక్తిగత వ్యాపార అవసరాలకు నగదు పొందేందుకు బంగారు రుణాలపై ఆధారపడటం సులువైన మార్గాలలో ఒకటి అనడంలో సందేహం లేదు. 49 నగరాల్లో 100 శాఖలను ప్రారంభించడం సంతోషంగా ఉందని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది