9 ఎయిర్‌బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీతో 7 సీటర్‌ ఫ్యామిలీ కారు... భారీ డిస్కౌంట్

Published : Jul 08, 2024, 10:44 PM IST
9 ఎయిర్‌బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీతో 7 సీటర్‌ ఫ్యామిలీ కారు... భారీ డిస్కౌంట్

సారాంశం

ఈ ఆఫర్‌లో భాగంగా స్కోడా కస్టమర్‌లకు డిస్కౌంట్   అలాగే  సర్వీస్  బెనిఫిట్స్  ఉంటాయి. ఇందులో తక్కువ వడ్డీ రేట్లు లేదా ఇతర ఫైనాన్సింగ్ అప్షన్స్  ఉండవచ్చు.  అలాగే, కస్టమర్‌లు ఈ లిమిటెడ్  పిరియడ్ ఆఫర్‌లో ఆకర్షణీయమైన ధరలకు లేదా ఎక్స్టెండెడ్  వారంటీ కవరేజీలో సర్వీస్ ప్యాకేజీ పొందవచ్చు. 

స్కోడా ఆటో ఇండియా కోడియాక్ SUV  7th  యానివర్సరీ  సందర్భంగా కస్టమర్లకు  లిమిటెడ్  పిరియడ్  బంపర్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. స్కోడా కొడియాక్ అన్నివెర్సరీ అలాగే ఇండియాలో స్కోడా 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 18 నుండి జూలై 24 వరకు కంపెనీ కస్టమర్లకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రకారం, మీరు స్కోడా కొడియాక్‌పై 7% డిస్కౌంట్ పొందుతారు. అయితే ఈ అఫర్ స్కోడా ఆటో ఇండియా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 

ఈ ఆఫర్‌లో భాగంగా స్కోడా కస్టమర్‌లకు డిస్కౌంట్   అలాగే  సర్వీస్  బెనిఫిట్స్  ఉంటాయి. ఇందులో తక్కువ వడ్డీ రేట్లు లేదా ఇతర ఫైనాన్సింగ్ అప్షన్స్  ఉండవచ్చు.  అలాగే, కస్టమర్‌లు ఈ లిమిటెడ్  పిరియడ్ ఆఫర్‌లో ఆకర్షణీయమైన ధరలకు లేదా ఎక్స్టెండెడ్  వారంటీ కవరేజీలో సర్వీస్ ప్యాకేజీ పొందవచ్చు. భారతదేశంలో స్కోడా 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్కోడా ఆటో ఇండియా ప్రతినెలా 24వ తేదీన కొన్ని మోడళ్లపై 24 గంటల ఆఫర్స్  పరిచయం చేస్తుంది. అంటే మీరు ఈ కాలంలో తక్కువ ధరకు కారును కొనవచ్చు.

ఈ క్యాంపైన్లో  కొడియాక్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు ప్రస్తుతం ఉన్న నాలుగు సంవత్సరాల వారంటీతో పాటు రెండు సంవత్సరాల స్టాండర్డ్  మెయింటెనెన్స్  ప్యాకేజీని కూడా ఉచితంగా పొందుతారు. స్కోడా అన్నివర్సరీ  గిఫ్ట్ గా ఐదేళ్ల ఎక్స్టెండెడ్  వారంటీని కూడా అందిస్తుంది. భారతదేశంలో SUV సెగ్మెంట్‌లో బ్రాండ్ పౌలారిటీ స్థాపించడంలో కోడియాక్ పాత్రను స్కోడా హైలైట్ చేస్తుంది. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానేబా మాట్లాడుతూ కొడియాక్  ఆకర్షణను ఇంకా స్కోడా విజయానికి దాని సహకారాన్ని హైలైట్ చేశారు. స్కోడా కొడియాక్ కంపెనీకి చాలా ముఖ్యమైన ప్రోడక్ట్ అని,  SUV సెగ్మెంట్‌లోకి కంపెనీ మరింత ముందడుగు వేస్తోందని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!