జూలై 23న కేంద్ర బడ్జెట్.. ఈసారి నిర్మలమ్మ ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పనుందంటే.. ?

By Ashok Kumar  |  First Published Jul 8, 2024, 2:22 PM IST

కేంద్ర బడ్జెట్ తేదీని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజుజు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సును అనుసరించి.. 2024 బడ్జెట్ సమావేశాల కోసం రాష్ట్రపతి ఉభయ సభలను ఆమోదించారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరుగుతుంది అంటూ పోస్ట్ చేశారు.


 న్యూఢిల్లీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జూలై 23న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ తేదీని ట్విట్టర్‌లో ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజుజు.. ‘కేంద్ర ప్రభుత్వ సిఫార్సును అనుసరించి, 2024 బడ్జెట్ సమావేశాల కోసం రాష్ట్రపతి ఉభయ సభలను ఆమోదించారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుండి ఆగస్టు 12 వరకు జరుగుతుంది’ అని పోస్ట్ చేశారు. 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను 2024 జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 ప్రభుత్వ పూర్తి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించనున్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

వరుసగా రెండోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను వరుసగా ఆరుసార్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్‌ను అధిగమించారు. ఈసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడితే వరుసగా ఏడుసార్లు సమర్పించిన మొదటి వ్యక్తి అవుతారు.

Latest Videos

కేంద్ర బడ్జెట్ 2024 తేదీలు ప్రకటించిన తరువాత మోడీ 3.0 ప్రభుత్వంలో పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి కొన్ని ప్రయోజనాలను ప్రకటించవచ్చని అంచనాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచవచ్చని చెబుతున్నారు. ఆదాయపు పన్నులో ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్ అని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ గృహాలకు రాష్ట్ర రాయితీలను పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోందని, గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 50 శాతం పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని  ప్రభుత్వ అధికారులు తెలిపారు.

click me!