Multibagger Stocks: మార్కెట్ ఊగిసలాటలో కూడా రూ.లక్షకు లక్షన్నర లాభాలు అందించిన స్టాక్స్ ఇవే...

Published : Mar 12, 2022, 01:16 PM IST
Multibagger Stocks: మార్కెట్ ఊగిసలాటలో కూడా రూ.లక్షకు లక్షన్నర లాభాలు అందించిన స్టాక్స్ ఇవే...

సారాంశం

గత వారం స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. భారీ నష్టాలతో గత వారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్, చివరకూ 5 రాష్ట్రాల ఎన్నికల జోష్ తో పుంజుకొని మార్కెట్లు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. అయితే ఈ ట్రెండ్ లో కూడా మార్కెట్లో కొన్ని స్టాక్స్ Multibagger Stocksగా లాభాలు అందించాయి. అలాంటి స్టాక్స్ లో టాప్ 5 ఏంటో చూద్దాం. 

Multibagger Stocks: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో మార్చి నెల ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు భారీగా పతనం బాట పట్టాయి. వరుసగా 4 ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ క్యాప్ ఏకంగా 13 లక్షల కోట్లు నష్టపోయింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మార్కెట్లు రికవరీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నిన్నటితో ముగిసిన వారంలో కొన్ని స్టాక్స్ Multibagger Stocksగా మారి, మంచి రాబడిని ఇచ్చాయి. టాప్ 5 అత్యధిక రాబడిని ఇచ్చే స్టాక్‌ల గురించి మాట్లాడుకుందాం. ఈ  స్టాక్స్ గరిష్ట రాబడి 52 శాతం నంచి కనీస రాబడి 33 శాతంగా ఉంది. అధిక రాబడిని ఇచ్చే స్టాక్‌లలో రెండు షుగర్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ ఉన్నాయి. 

గత వారం అత్యధిక రాబడిని అందించి, ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించిన స్టాక్స్ లో ఒరాకిల్ క్రెడిట్ లిమిటెడ్ (Oracle Credit Ltd), చోటాని ఫుడ్స్ లిమిటెడ్ (Chothani Foods Ltd), టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Take Solutions Ltd), ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Dwarikesh Sugar Industries Ltd), మరియు ఉగర్ షుగర్ వర్క్స్ (Ugar Sugar Works Ltd) లిమిటెడ్.

ఒరాకిల్ క్రెడిట్ లిమిటెడ్ (Oracle Credit Ltd)
ఒరాకిల్ క్రెడిట్ లిమిటెడ్ స్టాక్ గత వారం 52.17 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ షేరు గత వారంలో రూ.41.4 వద్ద ముగియగా, నిన్నటితో ముగిసిన వారంలో రూ.63 వద్ద ముగిసింది. BSCలో ట్రేడైన ఈ స్టాక్‌లో గత వారం ఎవరైనా రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, జస్ట్ వారం చివరి నాటికి రూ. 1,52,000 అయ్యి ఉండేవి.

చోఠాని ఫుడ్స్ లిమిటెడ్ (Chothani Foods Ltd)
అధిక రిటర్న్‌లు పొందిన స్టాక్స్  చోఠాని ఫుడ్స్ లిమిటెడ్ రెండవ స్థానంలో ఉంది. వారంలో 40.47 శాతం రాబడిని ఇచ్చింది. గత వారం ఛోఠానీ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ రూ.11.39 వద్ద ముగియగా, ఈసారి రూ.16 వద్ద ముగిసింది. గత వారం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, వారికి జస్ట్ వారంలో రూ. 1,40,000 వచ్చి ఉండేవి. 

టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Take Solutions Ltd)
టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్ ఈ వారం 38.46% రాబడిని ఇచ్చింది. గత వారం, ఈ స్టాక్ రూ. 27.3 వద్ద క్లోజింగ్ ఇవ్వగా, ఈ వారం దాని ముగింపు 37.8 వద్ద ముగిసింది.

ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Dwarikesh Sugar Industries Ltd)
మార్చి 11, 2022తో ముగిసిన వారానికి ద్వారికేష్ షుగర్ 36.02% రాబడిని ఇచ్చింది. గత వారం ఈ స్టాక్ ముగింపు 94.95 వద్ద జరిగింది, ఈ వారం ఈ స్టాక్ రూ. 129.15 వద్ద ముగిసింది. ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, జస్ట్ వారంలో రూ. 1,36,000 అయి ఉండేవి.

ఉగర్ షుగర్ వర్క్స్ లిమిటెడ్ (Ugar Sugar Works Ltd)
ఉగార్ షుగర్ స్టాక్ ఈ వారం రూ.64.05 వద్ద ముగియగా, గత వారం స్టాక్ రూ.47.95 వద్ద ముగిసింది. రెండు వారాల ధరలో 33.58 శాతం వ్యత్యాసం ఉంది. దీని ప్రకారం, ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ పెట్టుబడి రూ. 1,33,000 అయి ఉండేవి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్