Gold - Silver Price: మహిళలకు గుడ్ న్యూస్, త్వరలోనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టేచాన్స్..నేటి ధరలు ఇవే...

Published : Mar 12, 2022, 11:01 AM IST
Gold - Silver Price: మహిళలకు గుడ్ న్యూస్, త్వరలోనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టేచాన్స్..నేటి ధరలు ఇవే...

సారాంశం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. దీంతో బంగారం వెండి ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. అయితే దీర్ఘకాలంలో బంగారం ధరలు తగ్గే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Gold-Silver Price Today 12 March: భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం-వెండి ధరల్లో శనివారం (Gold-Silver Price) స్థిరంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మార్చి 12వ తేదీ విడుదలైన ధరల ప్రకారం బంగారం, బంగారం ధరల్లో స్వల్ప పతనం నమోదైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై కనిపిస్తోంది.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ibjarates.com, శనివారం ఉదయం 24 కేరట్ల స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ. 52462గా  నమోదైంది. అదే సమయంలో, కిలో వెండి ధర రూ.438 తగ్గింది. దీంతో కిలో వెండి ధర 69377కు చేరింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,580 రూపాయలుగా ఉంది. 

ఇదిలా ఉంటే ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన బంగారం ధరలు,  స్వచ్ఛత ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. IBJA జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా సార్వత్రికమైనవి కానీ దాని ధరలలో GST ఉండదు.  ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, పన్నుతో సహా బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి.  

మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధర తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తప్ప ఇబ్జా రేట్లు జారీ చేయడం లేదు. 22 క్యారెట్లు  18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. తక్కువ సమయంలో SMS ద్వారా రేట్లు అందుతాయి. ఇది కాకుండా, తరచుగా అప్‌డేట్‌ల గురించి సమాచారం కోసం మీరు www.ibja.comని సందర్శించవచ్చు.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్