బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తున్న కొత్త రూల్స్ ఇవే.. ప్రజలపై నేరుగా ఎఫెక్ట్..!

Published : Jan 30, 2022, 09:39 AM IST
బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తున్న కొత్త రూల్స్ ఇవే.. ప్రజలపై నేరుగా ఎఫెక్ట్..!

సారాంశం

ఫిబ్రవరి 1 నుంచి కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. బ్యాంకింగ్ రంగం నుంచి మొదలుకుని ఇతర రంగాలకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పు రానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, State Bank of India, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు వివిధ సేవలకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి. 

జనవరి నెల చివరకు వచ్చేశాం.. ఫిబ్రవరి నెలలోకి అడుగుపెతున్నాం. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. బ్యాంకింగ్ రంగం నుంచి మొదలుకుని ఇతర రంగాలకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పు రానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, State Bank of India, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు వివిధ సేవలకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి. దీని వల్ల ప్రజలపై నేరుగానే ప్రభావం పడబోతోంది. 

ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను (Budget 2022-23) ప్రవేశపెట్టబోతున్నారు. సాధారణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గితే, మరికొన్నింటివి పెరుగుతాయి. ముఖ్యంగా వివిధ రంగాలపై బడ్జెట్‌ ప్రభావం చూపుతోంది. బడ్జెట్ మాత్రమే కాకుండా.. ఫిబ్రవరి మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. మరి ఫిబ్రవరి 1(మంగళవారం) నుంచి మారే అంశాలు ఏంటివో ఒకసారి తెలుసుకుందాం..

SBI భారీ మార్పులు..!
దేశంలోని తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ నగదు బదిలీ నిబంధనలను మారుస్తోంది. తక్షణ చెల్లింపు సేవ/ IMPS ఛార్జీని ఎస్‌బీఐ పెంచుతోంది. IMPS ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య డబ్బును బదిలీ చేయడానికి బ్యాంక్ రూ. 20 + ప్లస్ GST ఛార్జీని వసూలు చేయనుంది. ఈ నిబంధనతో ఐఎంపీఎస్ ద్వారా డబ్బును బదిలీ చేసేవారిపై అదనపు భారం పడనుంది.  2021 అక్టోబర్‌లో..  రిజర్వ్ బ్యాంక్ IMPS ద్వారా డబ్బు పంపే పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. IMPS ప్రస్తుతం డబ్బు బదిలీకి అత్యంత విశ్వసనీయ మాధ్యమంగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా నిబంధనల మార్పు..
ఫిబ్రవరి 1 నుంచి Bank of Baroda చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఫిబ్రవరి 1 నుంచి చెక్ చెల్లింపు కోసం సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. అంటే.. చెక్‌కు సంబంధించిన సమాచారం బ్యాంక్‌కు పంపవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే చెక్ క్లియర్ చేయబడుతుంది. ఈ మార్పులు రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెక్ క్లియరెన్స్ కోసం మాత్రమే. 

PNB నిబంధనలు కఠినం..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మారుతున్న నియమాలు కస్టమర్లపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులు కస్టమర్లను ఆందోళనకు కూడా గురిచేస్తున్నాయి. అవి ఏమిటంటే.. మీ ఖాతాలో డబ్బు లేకపోవడం వల్ల ఇన్‌స్టాల్‌మెంట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఫెయిల్ అయితే భారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. ఇందుకోసం రూ. 250 పెనాల్టీ చెల్లించాలి. దీని కోసం ఇప్పటివరకు రూ. 100 వసూలు చేసేవారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 

గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు
ఎల్‌పీజీ ధర ప్రతినెలా మొదటి తేదీన నిర్ణయించడం గమనార్హం. మరి ఈ ఒకటో తేదీన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. సిలిండర్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. ధరలు పెరిగినా.. తగ్గినా.. కచ్చితంగా ప్రజల జేబులపై ప్రభావం చూపుతుంది.

ఫిబ్రవరి 1న బడ్జెట్‌..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష పన్ను (వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు) నిబంధనలలో మార్పులు ఉండవచ్చు. కరోనా విధ్వంసం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఈ సాధారణ బడ్జెట్ చాలా కీలకం. 5 రాష్ట్రాలకు ఎన్నికలు కూడా రానున్నాయి కాబట్టి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్