ఈ దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సమయంలో కొనాల్సిన టాప్ బ్రోకరేజీల స్టాక్ రికమండేషన్స్ ఇవే..ఓ లుక్కేయండి..

Published : Oct 24, 2022, 04:33 PM IST
ఈ దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సమయంలో కొనాల్సిన టాప్ బ్రోకరేజీల స్టాక్ రికమండేషన్స్ ఇవే..ఓ లుక్కేయండి..

సారాంశం

Diwali Muhurat Trading 2022: నేటి muhurat trading సందర్భంగా స్టాక్స్ కొనాలని చూస్తున్నారా. అయితే మార్కెట్లోని టాప్ బ్రోకరేజి సంస్థలు రికమండ్ చేసిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. (Diwali stock recommendations)  

Diwali stock recommendations: దీపావళి రోజున, స్టాక్ మార్కెట్‌లో ముహూరత్ ట్రేడింగ్  వేళ  షేర్లు కొనడం శుభంగా భావిస్తారు.  ఈ రోజు ఇన్వెస్టర్లకు పెట్టుబడి కోసం ఒక గంట సమయం లభిస్తుంది. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఎక్కువ సంఖ్యలో  ఇన్వెస్టర్లు షేర్లను కొనడం, విక్రయించడం శుభపరిణామంగా భావిస్తారు. ప్రపంచ సంక్షోభాల మధ్య, ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్‌లో చాలా హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నాయి.

 కానీ గత 7 సెషన్లలో దలాల్ స్ట్రీట్ పనితీరు మెరుగుపడింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ 12 పాయింట్ల జంప్‌తో 17,576 వద్ద ముగిసింది. ఇదే సమయంలో బీఎస్ఈ 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద ముగిసింది. మీరు ముహూరత్ ట్రేడింగ్ సమయంలో కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే, నిపుణుల రికమండేషన్స్ చేసిన ఈ 4 స్టాక్‌లపై మీరు పెట్టుబడి పెట్టవచ్చు. 

నిపుణులు రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవే…
అనుగ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ (IIFL సెక్యూరిటీస్) రికమండేషన్స్

1- సుజ్లాన్ ఎనర్జీ - రూ. 11 టార్గెట్ ధర (స్టాప్ లాస్ - రూ. 6.50)
2- ఎలక్ట్రానిక్ మార్ట్ - రూ. 102 టార్గెట్ ధర (స్టాప్ లాస్ - రూ. 80)

రవి సింఘాల్ - CEO - GCL సెక్యూరిటీస్ రికమండేషన్స్
3- కోటక్ మహీంద్రా బ్యాంక్ - టార్గెట్ ధర రూ. 1940-1989 (స్టాప్ లాస్ 1870)
4- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - టార్గెట్ ధర - రూ. 44 నుండి రూ. 50 (స్టాప్ లాస్ - 38.50)

ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి?
JM ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ అండ్ టెక్నికల్ హెడ్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, “ప్రస్తుతం నిఫ్టీ మెరుగైన స్థితిలో ఉంది. రానున్న రోజుల్లో నిఫ్టీ 18,000 లేదా 18,100 స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం. గత రెండు సెషన్లలో బ్యాంకింగ్ రంగం 10 శాతం లాభపడింది. ఇలాంటి రియాక్షన్‌ కనిపించినప్పుడల్లా మార్కెట్‌ పెరుగుతూనే ఉంటుంది. రుచిత్ జైన్, లీడ్ రీసెర్చ్, 5paisa.com ఇలా అన్నారు, “చార్ట్ నమూనా చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇది మొమెంటం సానుకూల వృద్ధికి సంభావ్యతను చూపుతోంది. ఏదైనా ప్రతికూలత విషయంలో, పెట్టుబడిదారు కొనుగోలుపై దృష్టి పెట్టాలి. అయితే, స్టాక్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారం పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి లాభ నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు ఫైనాన్షియల్ సలహాదారుని సంప్రదించండి.)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్