పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు.. నేడు దీపావళి రోజున పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల..

By asianet news teluguFirst Published Oct 24, 2022, 8:45 AM IST
Highlights

గత కొద్ది రోజులుగా క్రూడాయిల్ ధరలో స్థిరమైన పెరుగుదల కొనసాగుతుంది. గత రెండు నెలల్లోనే  క్రూడాయిల్  రికార్డు స్థాయిలో పడిపోయింది. అయితే ఆ  సమయంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి ఉపశమనం ఇవ్వలేదు.
 

 గత కొద్ది రోజులుగా క్రూడాయిల్ ధర రికార్డు స్థాయి నుండి  కనిష్ట స్థాయికి దిగజారిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ పెరుగుదలను నమోదు చేస్తోంది. ఉత్పత్తి కోత కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 90 డాలర్లకుపైగా మళ్లీ ఎగబాకుతోంది. గత రెండు నెలలుగా ముడిచమురు ధర తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

వాణిజ్య గ్యాస్ సిలిండర్లు 
ఆయిల్ కంపెనీలు అక్టోబర్ ప్రారంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. అయితే ఆ సమయంలో ఇంధన ధరలో ఎలాంటి ఉపశమనం లేదు. పెట్రోల్ -డీజిల్ ధరలలో చివరిసారి మార్పు మే 22న జరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలు ఇంత కాలం నిలకడగా ఉండడం ఇదే తొలిసారి. మే 22న ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. ఎక్సైజ్‌ ట్యాక్స్ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. దీని తరువాత మహారాష్ట్రలో ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించబడింది, ఈ కారణంగా ధర తగ్గింది.

నేడు క్రూడ్ ఆయిల్
WTI క్రూడ్ ధర సోమవారం ఉదయం బ్యారెల్‌కు సుమారు $ 88.09 వద్ద, బ్రెంట్ క్రూడాయిల్  బ్యారెల్‌కు $ 93.50కి చేరుకుంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంధన ధరల పై వ్యాట్‌ను తగ్గించారు. దీంతో పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.3 తగ్గింది. అయితే మేఘాలయలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధర ఒకటిన్నర రూపాయలు పెరిగింది.

 అక్టోబర్ 24న పెట్రోలు-డీజిల్ ధరలు
–ఢిల్లీ పెట్రోల్ ధర రూ. 96.72 & డీజిల్ ధర రూ. 89.62 లీటర్‌కు
–ముంబై పెట్రోల్ ధర  రూ. 111.35 & డీజిల్ ధర  రూ. 97.28 లీటర్‌కు
– చెన్నై పెట్రోలు ధర  రూ. 102.63 & డీజిల్ ధర రూ.94.24 లీటరుకు
- కోల్ కత్తా పెట్రోలు ధర  రూ . 106.03, డీజిల్ లీటరుకు రూ. 92.76
- నోయిడాలో పెట్రోలు ధర   రూ. 96.57, డీజిల్ ధర   రూ. 89.96
- లక్నోలో పెట్రోల్ ధర   రూ. 96.57, డీజిల్ ధర   లీటరుకు రూ . 89.76
- జైపూర్‌లో పెట్రోల్ ధర   రూ. 108.48, డీజిల్ ధర  రూ.93.72
-పాట్నాలో పెట్రోల్ ధర   రూ. 107.24, డీజిల్ లీటరుకు రూ. 94.04
- గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ లీటరుకు రూ. 90.05
- బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89
- భువనేశ్వర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.19, డీజిల్‌ ధర రూ.94.76
-చండీగఢ్‌లో పెట్రోల్‌  రూ.96.20, డీజిల్‌ ధర రూ.84.26
-హైదరాబాద్‌లో పెట్రోల్‌  రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా ప్రతిరోజు ఇంధన ధరలను జారీ చేస్తాయి. పెట్రోలు, డీజిల్ ధరల్లో ఏదైనా మార్పు ఉంటే ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తారు. వివిధ రాష్ట్రాలలో VAT కారణం ప్రతి రాష్ట్రనికి పెట్రోల్, డీజిల్ ధరలలో  మార్పు ఉంటుంది.

click me!