మార్కెట్లో ఈ పంట ధర ఒక క్వింటాల్‌కు రూ. 54 వేలు దాటింది, రైతులకు పండగే.. ఏ పంటో తెలిస్తే..అవాక్కవడం ఖాయం

Published : Jun 22, 2023, 03:07 AM ISTUpdated : Jun 22, 2023, 03:08 AM IST
మార్కెట్లో ఈ పంట ధర ఒక క్వింటాల్‌కు రూ. 54 వేలు దాటింది, రైతులకు పండగే.. ఏ పంటో తెలిస్తే..అవాక్కవడం ఖాయం

సారాంశం

జీలకర్ర ధరలు ఆకాశాన్నంటాయి, ఈ మసాలా పంట విజృంభించడానికి కారణాలు అనేకం ఉన్నాయి. గుజరాత్ లోని ఉంజా మార్కెట్లో  జీలకర్ర క్వింటాల్ ధర నవంబర్ 12, 2022న రూ. 20,000 నమోదు కాగా, జూన్ 20, 2023న క్వింటాల్‌కు రూ. 54,125 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి నమోదైంది. అంటే సుమారు రెండింతలు పైనే జీలకర్ర రేటు పలికింది. .

భారతీయ వంటకాల్లో ప్రతిరోజూ ఉపయోగించే సుగంధ ద్రవ్యం జీలకర్ర. తాజాగా గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని ఉంఝా APMC మార్కెట్‌యార్డులో జీలకర్ర ధర మొదటిసారిగా రూ. 50,000 దాటింది.  గత మంగళవారం నాడు జీలకర్ర క్వింటాల్ రూ. 54,125 వద్ద సరికొత్త ఆల్ టైమ్ హైని తాకింది. గత ఎనిమిది నెలలుగా, జీలకర్ర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జీలకర్ర ధరల పెరుగుదల నవంబర్ 12, 2022 నుండి ప్రారంభమైంది. గత ఏడాది నవంబర్ లో జీలకర్ర ధర మొదటిసారిగా రూ. 20,000 చేరుకుంది. అప్పటి నుంచి జీలకర్ర ధర రెట్టింపు అయ్యింది. 

జీలకర్ర ధరలు పెరగడానికి కారణం
మార్కెట్‌యార్డు అధికారుల ప్రకారం, జీలకర్ర ధరలు పెరగడానికి డిమాండ్ ప్రధాన కారణంగా ఉంది. ఉంజా ఏపీఎంసీ మార్కెట్ యార్డుకు వచ్చే జీలకర్ర మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉంజ జీలకర్రకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం.

జీలకర్ర ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశంలో జీలకర్ర ఉత్పత్తి 2019-20లో 9.12 లక్షల టన్నులుగా ఉంది, 2020-21లో 7.95 లక్షల టన్నులకు, 2021-22లో 7.25 లక్షల టన్నులకు తగ్గింది. ప్రధానంగా మార్చి ద్వితీయార్ధంలో గుజరాత్ లో అకాల వర్షాల కారణంగా 2022-23 పంట పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు.

జీలకర్ర ధరను నిర్ణయించే ఇతర అంశాలు
భారతదేశంలో ఉత్పత్తి అయిన జీలకర్ర స్థానికంగా వినియోగిస్తారు. అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. జీలకర్ర ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 2.17 లక్షల టన్నులు (రూ. 3,343.67 కోట్లు) ఉండగా, 2022-23 (ఏప్రిల్-మార్చి)లో 1.87 లక్షల టన్నులు (విలువ రూ. 4,193.60 కోట్లు) నమోదయ్యాయి. భారతీయ జీలకర్ర ఎగుమతి మార్కెట్లలో చైనా, బంగ్లాదేశ్, USA,UAE,పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ అగ్రభాగంలో ఉన్నాయి.

భారత జీలకర్రను చైనా దూకుడుగా కొనుగోలు చేస్తోంది
ఉంజా జీలకర్ర ఎగుమతిదారుడు ఒకరు మాట్లాడుతూ, “చైనా భారతీయ జీలకర్రను దూకుడుగా దిగుమతి చేసుకుంటోంది. గత మూడు నెలల్లో భారత్ నుంచి చైనా 25,000-30,000 టన్నుల జీలకర్రను దిగుమతి చేసుకుంది. ఈ నెల బక్రీద్ పండుగ కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి కూడా డిమాండ్ ఉందని తెలిపారు. జీలకర్ర కొత్త పంట  వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో మార్కెట్‌లోకి వస్తుంది, కాబట్టి మార్కెట్‌లోని ప్రతి ఒక్కరూ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

జీలకర్ర ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏవి?
జీలకర్ర ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రపంచంలో పండించే మొత్తం జీలకర్రలో దాదాపు 70 శాతం వాటా భారత్ కలిగి ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా, సిరియా, టర్కీ, యుఎఇ, ఇరాన్‌లలో జీలకర్ర సాగు చేస్తారు. భారతదేశం మినహా పై దేశాలలో, అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా, జీలకర్ర ఉత్పత్తి, సరఫరా దెబ్బతింటుంది, ఇది ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.

భారతదేశంలో జీలకర్ర ఎక్కడ ఎక్కువగా పండిస్తారు?
భారతదేశంలో జీలకర్రను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్. జీలకర్ర భారతదేశంలో దాదాపు 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తారు . 2021-22 సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 7.25 లక్షల టన్నుల జీలకర్ర ఉత్పత్తి అయ్యింది, ఇందులో 4.20 లక్షల టన్నులు గుజరాత్‌లో, 3.03 లక్షల టన్నులు రాజస్థాన్‌లో పండించారు. 

ఇతర రాష్ట్రాల రైతులు జీలకర్ర ఎందుకు సాగు చేయడం లేదు?
జీలకర్ర వాతావరణానికి చాలా సున్నితమైన పంట. జీలకర్ర శీతాకాలంలో సాగు చేస్తారు. ఈ పంటకు తేమ లేకుండా మధ్యస్తంగా చల్లని, పొడి వాతావరణం అవసరం, అయితే అటువంటి వాతావరణం ఉన్నటువంటి, ఉత్తర గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మెహసానా , అలాగే పశ్చిమ రాజస్థాన్‌లోని జలోర్, బార్మర్, జోధ్‌పూర్, జైసల్మేర్, పాలి, నాగౌర్‌లతో సహా కొన్ని జిల్లాల్లో జీలకర్ర పండిస్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!