ఒక్క‌ ట్వీట్‌తో 14 వందల కోట్ల‌ డాల‌ర్లు మాయం...

By Sandra Ashok KumarFirst Published May 2, 2020, 6:44 PM IST
Highlights

టెస్లాలో ఎల‌న్ మస్క్ సొంత వాటాను 3 బిలియన్లకు పడగొట్టింది, ఎందుకంటే అతని ట్వీట్ వల్ల పెట్టుబడిదారులు వెంటనే కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది."టెస్లా కంపెనీ స్టాక్ షేర్ విలువ ధర చాలా ఎక్కువ," అని అతను చేసిన ఒక ట్వీట్లలో ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. 
 

టెస్లా కంపెనీ అధినేత ఎల‌న్ మ‌స్క్  తన కంపెనీ షేర్ విలువ చాలా ఎక్కువగా ఉందని ట్వీట్ చేసిన తరువాత కార్ల తయారీ కంపెనీ  విలువ నుండి 14 బిలియన్ డాలర్ల తుడిచిపెట్టుకుపోయాయి.

టెస్లాలో ఎల‌న్ మస్క్ సొంత వాటాను 3 బిలియన్లకు పడగొట్టింది, ఎందుకంటే అతని ట్వీట్ వల్ల పెట్టుబడిదారులు వెంటనే కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది.

"టెస్లా కంపెనీ స్టాక్ షేర్ విలువ ధర చాలా ఎక్కువ," అని అతను చేసిన ఒక ట్వీట్లలో ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. మరొక  ట్వీట్లలో, తన స్నేహితురాలు తనపై పిచ్చిగా ఉందని చేసిన ట్వీట్ ద్వారా మరింత అయోమ‌యంలో ప‌డేసింది.

2018 లో, న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో టెస్లా భవిష్యత్తు గురించి ఒక ట్వీట్ ద్వారా  సంస్థకు 20 మిలియన్ జరిమానా కూడా విధించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ బిలియనీర్ను షేర్ వాల్యూ ఎక్కువ‌గా ఉంద‌న్న ట్వీట్ నిజ‌మేనా అని సంప్ర‌దించ‌గా టెస్లా కాద‌ని స‌మాధానం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యానికి దారి తీసింది. 

టెస్లా కంపెనీ షేర్ ధర ఈ సంవత్సరం భారీగా పెరిగింది, ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల విలువ సుమారు 100 బిలియన్ల డాలర్లు దగ్గరగా ఉన్నది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ వారం ప్రారంభంలో అతను తన 33.4 మిలియన్ల మంది ఫాలోవర్లకు యుఎస్ స్టే-ఎట్-హోమ్ ఆంక్షలపై తీవ్ర విమర్శలు చేశాడు. 

click me!