Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అదిరిపోయే ఆఫర్లు ఇవిగో

Published : Mar 07, 2025, 11:53 AM IST
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అదిరిపోయే ఆఫర్లు ఇవిగో

సారాంశం

Tata Nexon EV: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో క్రేజీ కార్లలో ఒకటైన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కారు కిలోమీటర్ల రేంజ్ కూడా పెరిగింది. అంతేకాకుండా మంచి డిస్కౌంట్లతో తక్కువ ధరకు లభిస్తోంది. నెక్సాన్ ఈవీ కొనాలనుకొనే వారికి ఇదే మంచి టైం. ఈ కారు ఫీచర్స్, డిస్కౌంట్ ఆఫర్లు తెలుసుకుందాం రండి. 

Tata Nexon EV: టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లిస్టులో చాలా పాపులర్ మోడల్ నెక్సాన్ ఈవీ. ఇప్పుడు టాటా కంపెనీ దీన్ని అప్‌డేట్ చేసింది. ఈ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్, ఎక్కువ పవర్, ఎక్కువ ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. టాటా కంపెనీ ఇప్పుడు నెక్సాన్ ఈవీ కారు 2024 ఎడిషన్‌పై రూ.40,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ అని ఇంకా చాలా ఆఫర్లు ఈ డిస్కౌంట్ లిస్టులో ఉన్నాయి. ఈ ఆఫర్ మార్చి 31 వరకే ఉంటుంది. నెక్సాన్ ఈవీ కొనాలనుకొనే వారికి ఇదే మంచి టైం. 

టాటా నెక్సాన్ ఈవీ ఫీచర్లు

నెక్సాన్ ఈవీలో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 15% ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. కానీ ఈ బ్యాటరీ ప్యాక్ బరువు కొంచెం ఎక్కువ. ఈ కారు 489 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళుతుందని ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ఇచ్చింది. 

టాటా నెక్సాన్ ఈవీ డిజైన్ చాలా నీట్‌గా ఉంది. ఈ టాటా కారు ముందు భాగం కొత్తగా డిజైన్ చేశారు. కారు ముందు భాగంగా ఎల్ఈడీ స్ప్లిట్ హెడ్‌లైట్లతో డీఆర్ఎల్‌లు ఉన్నాయి. ముఖ్యమైన హెడ్‌లైట్ క్లస్టర్ దాని కింద ఉంది. ఎల్ఈడీ లైట్లతో టెయిల్‌గేట్ కూడా మార్చారు. టాటా నెక్సాన్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. 

టాటా నెక్సాన్ ఈవీ జస్ట్ 8.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అందుకే కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 56 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చే కార్లు దీనికంటే త్వరగా ఛార్జ్ చేసేలా డిజైన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి టాటా కార్లలో చీప్ అండ్ బెస్ట్ కారు ఇదే. దీనిపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్. ఆలస్యం చేయకండి

టాటా నెక్సాన్ ఈవీ స్పెషాలిటీ ఇదే..

టాటా ఈవీలో V2V ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అందుకే ఈ కారు వేరే ఎలక్ట్రిక్ కారుతో కూడా ఛార్జ్ చేయొచ్చు. దీని V2L టెక్నాలజీని యూజ్ చేసి కారును ఛార్జ్ చేయొచ్చు. దీని ద్వారా ఏ గ్యాడ్జెట్ నుంచి అయినా ఈ కారును ఛార్జ్ చేయొచ్చు.

పెద్ద బ్యాటరీతో అప్‌డేట్ చేసిన నెక్సాన్ ఈవీలో కొత్త పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఇది 80% వరకు ఛార్జ్ అవ్వాలంటే గత వేరియంట్ లో అయితే 56 నిమిషాలు పట్టేది. ఇప్పుడు 48 నిమిషాలకే ఛార్జ్ అవుతుంది. క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+, రెడ్ డార్క్ అని చాలా వేరియంట్స్‌లో నెక్సాన్ ఈవీ కొనొచ్చు.

ఇది కూడా చదవండి హైడ్రోజన్ తో నడిచే లారీలు వచ్చేస్తున్నాయ్. ఒక్కసారి ఫిల్ చేస్తే 500 కి.మీ నాన్ స్టాప్

గమనిక: వేర్వేరు ప్లాట్‌ఫామ్ సహాయంతో కారుపై వచ్చే డిస్కౌంట్లను ఇక్కడ వివరించాం. ఈ డిస్కౌంట్లు ఒక్కో రాష్ట్రానికి, ఒక్కో ఏరియాకు, ఒక్కో సిటీకి, డీలర్‌షిప్‌కు, స్టాక్‌కు, కలర్‌కు, వేరియంట్‌కు తగ్గట్టు మారుతాయి. అందుకే కారు కొనే ముందు మీ దగ్గరలో ఉన్న డీలర్‌ను అడిగి తెలుసుకోండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది