వీధికుక్కలపై రతన్ టాటా ప్రేమ.. వీటికోసం ప్రత్యేకమైన భవనం, తాజ్ హోటల్ నుండి మాంసం కూడా..

By Sandra Ashok KumarFirst Published Nov 5, 2020, 7:29 PM IST
Highlights

 ఒక విభాగానికి ప్రయోజనం చేకూర్చడం లేదా ఒక సంస్థకు విరాళం ఇవ్వడం అయినా రతన్ టాటా వీటన్నిటిలో ముందంజలో ఉంటారు. బొంబాయిలోని టాటా గ్రూప్  ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.

టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. ఒక విభాగానికి ప్రయోజనం చేకూర్చడం లేదా ఒక సంస్థకు విరాళం ఇవ్వడం అయినా రతన్ టాటా వీటన్నిటిలో ముందంజలో ఉంటారు.  

దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన రతన్ టాటా మనుషులకు మాత్రమే కాదు, పెంపుడు జంతువులపై ఆయనకున్న ప్రేమకు కూడా ప్రసిద్ది, ముఖ్యంగా కుక్కలు. బొంబాయిలోని టాటా గ్రూప్  ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.

రెండు సంవత్సరాల క్రితం టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కుక్కల కోసం ఒక ఇల్లు కూడా నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడి వీధి కుక్కలు చాలా కాలం నుండి బొంబాయి హౌస్ లో నివసిస్తున్నాయి.

also read 

ప్రధాన కార్యాలయం రిసెప్షన్ వద్ద ఈ కుక్కలు తరచుగా కనిపిస్తుంటాయి. కార్యాలయం భవనం సెక్యూరిటీ గార్డుల గదులలో ఈ కుక్కలు నిద్రించేవట. కానీ రతన్ టాటా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కుక్కల కోసం భవనంలో ఒక ప్రత్యేక గదిని నిర్మించాడు.

కుక్కల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కానెల్: బొంబాయి హౌస్‌లో నివసించే కుక్కల కోసం రూపొందించిన ఈ కానెల్ చాలా ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో కుక్కలు స్వేచ్ఛగా తిరగగలవు. వాటికి బొమ్మలు, తినడానికి కుక్క బిస్కెట్లు, తాజ్ హోటల్ నుండి వచ్చే మాంసం కూడా అందిస్తారు.

రతన్ టాటాకు కుక్కల పట్ల ఉన్న ప్రేమను కొంతకాలం క్రితం అతను తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ ద్వారా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసాడు. అందులో ఒక కుక్క అతనితో ఆడుకోవడం కనిపించింది. ఈ కుక్కను గోవా నుంచి ముంబైకి తీసుకువచ్చారు. ఇది రతన్ టాటాకు ఇష్టమైన కుక్క అని చెబుతుంటారు.

click me!