
ముంబై, నవంబర్ 5, 2020: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్)లో 2.04% వాటా కొనుగోలు కోసం పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పిఐఎఫ్) రూ.9,555 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పిఐఎఫ్) అనేది సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటి. రిలయన్స్ రీటైల్‌లో ఇది ఎనిమిదవ పెట్టుబడి. గతంలో పీఐఎఫ్ రిలయన్స్ టెలికాం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది.
రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 4.587 లక్షల కోట్లు. ఆర్‌ఆర్‌విఎల్ ఇప్పటివరకు 10.09 శాతం వాటాలను 47,265 కోట్ల రూపాయలకు విక్రయించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ మాట్లాడుతూ: "రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సౌదీ అరేబియాతో దీర్ఘకాల సంబంధం ఉంది. నేను రిలయన్స్ రిటైల్ లో విలువైన భాగస్వామిగా పిఐఎఫ్ ని స్వాగతితీస్తున్నాను, సౌదీ అరేబియా మద్దతు, మార్గదర్శకత్వంతో ముందుకు సాగుతామని, భారత రిటైల్ రంగంలో విశేష మార్పులకు ఇదొక ప్రతిష్టాత్మక ప్రయాణమంటూ, ఈ పెట్టుబడి భారతదేశ ఆర్థిక వ్యవస్థను, పీఐఎఫ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు.
also read లోన్ మొరాటోరియం కేసు: విచారణను నవంబర్ 18 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ...
పిఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ మాట్లాడుతూ: "మేము ఈ పెట్టుబడితో సంతోషిస్తున్నాము, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ లావాదేవీ పిఐఎఫ్ నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బిజినెస్. దేశవ్యాప్తంగా ఉన్న 12వేల స్టోర్లు ద్వారా సేవలని అందిస్తుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ రిటైల్ రంగాన్ని మెరుగుపరుస్తుంది" అని అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ, దీని టర్నోవర్ రూ.659 కోట్లు, క్యాష్ ప్రాఫిట్ రూ.71వేల కోట్లు, నికర లాభం మార్చి 31, 2020తో ముగిసిన సంవత్సరానికి రూ.39,880 కోట్లు. భారతదేశం నుండి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ప్రస్తుతం 96వ ర్యాంకింగ్ లో ఉంది. 2019 ‘ఫోర్బ్స్ గ్లోబల్ 2000’ ర్యాంకింగ్స్‌లో కంపెనీ 71వ స్థానంలో ఉంది. లింక్డ్‌ఇన్ ఉత్తమ సంస్థలలో 10వ స్థానంలో ఉంది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ గురించి
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఆర్‌ఆర్‌విఎల్ ఏకీకృత టర్నోవర్ రూ.162,936 కోట్లు, 31 మార్చి 2020తో ముగిసిన సంవత్సరానికి నికర లాభం రూ.5,448 కోట్లు. 2013-18 మధ్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 రిటైలర్ల జాబితాలో రిలయన్స్ రిటైల్ అగ్రస్థానంలో ఉంది.