ఇన్‌స్టాగ్రామ్‌ లో రతన్ టాటా వైరల్ ఫోటో...గంటలో లక్షకు పైగా లైక్స్

By Sandra Ashok Kumar  |  First Published Jan 24, 2020, 1:30 PM IST

"లాస్ అంజెల్స్ లో నేను ఉన్నప్పటి  ఒక మధురమైన  ఫోటో" అని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ లో  పోస్ట్ చేశారు."నేను నిన్న దీన్ని పోస్ట్ చేయబోయే ముందు, నాకు 'త్రోబ్యాక్'ల గురించి ఇంకా గురువారాలలో అవి  నాకు ఎలా ఒక గుర్తుగా ఉంటాయో చెప్తూ " రతన్ టాటా తన పోస్టులో రాశాడు.  వైట్ టీ షర్టులో ధరించి కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న తన పాత ఫోటోని షేర్ చేశాడు.


ప్రజా జీవితం నుండి సుదీర్ఘ విరామం తర్వాత మూడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన రతన్ టాటా, సోషల్ మీడియాని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ ఉదయం, టాటా గ్రూప్ సంస్థ 82 ఏళ్ల ఛైర్మన్ ఎమెరిటస్ లాస్ ఏంజిల్స్లో తాను గడిపిన రోజులకు సంభందించిన ఒక ఫోటోని పోస్ట్ చేశారు. దానికి #ThrowbackThursday అని హష్ టాగ్ కూడా  చేశారు.

 నిన్న అంటే గురువారం రోజున ఈ  ఫోటోని  పోస్ట్ చేశాడు. "త్రో బ్యాక్" గురించి ఆ ఫోటో గురువారంతో ఎలా కనెక్ట్ అవుతాయో చెప్పాడు.త్రో బాక్ గురువారం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఒక పాపులర్ ఇంటర్నెట్ ట్రెండ్. ఈ రోజున ప్రజలు వారు గురువారం రోజున దిగిన పాత ఫోటోలను  సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 

Latest Videos

undefined

also read మోదీ సర్కార్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్​పై భారీ అంచనాలు...

అలాగే ఒక జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటు ఆ అనుభూతుని పంచుకుంటారు. #ThrowbackThursday లేదా #TBT అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇందుకోసం సోషల్ మీడియా  ఇన్‌స్టాగ్రామ్‌ లో ఉపయోగిస్తుంటారు."నేను నిన్న దీన్ని పోస్ట్ చేయబోయే ముందు, నాకు 'త్రోబ్యాక్'ల గురించి ఇంకా గురువారాలలో అవి  నాకు ఎలా ఒక గుర్తుగా ఉంటాయో చెప్తూ " రతన్ టాటా తన పోస్టులో రాశాడు.

వైట్ టీ షర్టులో ధరించి కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న తన పాత ఫోటోని షేర్ చేశాడు.అతను ఇండియాకి రాకముందే, ఈ ఫోటోని లాస్ ఏంజిల్స్‌లో క్లిక్ చేశానని వివరించాడు.ఒక ఇంగ్లిష్ చానల్ ప్రకారం, 1962 చివరిలో భారతదేశానికి తిరిగి రాకముందు లాస్ ఏంజల్స్ లోని జోన్స్, ఎమ్మన్స్ తో రతన్ టాటా పనిచేశారు.

"నేను భారతదేశానికి తిరిగి రావడానికి చాలా కాలం ముందు లాస్ ఏంజల్స్ లో నేను గడిపిన రోజులలో  ఒక త్రోబాక్  మెమరీస్  ఉన్నాయి " అని రతన్ టాటా రాశాడు.రతన్ టాటా షేర్ చేసిన ఈ ఫోటోలకు ఒక గంటలో వేలాది మంది తన ఫలోవర్స్ కాంప్లిమెంట్స్ తెలిపారు. ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ లో తన పోస్టుకి 1 లక్షకు పైగా 'లైక్' వచ్చాయి.

also read గ్రామీణులకు డైరెక్ట్ ఇన్సెంటివ్‌లు... నిర్మలా సీతారామన్‌....

"మీరు భారతదేశానికి తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు సార్" అని ఒక వ్యక్తి కామెంట్ చేయగా, "ఎప్పటి నుంచో డాషింగ్, సార్!"అని మరొకరు అన్నారు.మరొక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే "మిస్టర్ టాటా, మీరు పోస్టులో రాసింది నాకు నచ్చింది" అని కామెంట్ చేస్తూ ప్రశంసించారు.

ఇంకొకరయితే "మీరు గ్రీకు దేశ దేవుడిలా కనిపిస్తారు" అని అన్నారు.నవంబర్ లో కూడా రతన్ టాటా ఒక  త్రోబాక్ ఫోటోని పోస్ట్ చూశారు.రతన్ టాటా గత ఏడాది అక్టోబర్ 30న సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్  ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు.

click me!