గ్రామీణులకు డైరెక్ట్ ఇన్సెంటివ్‌లు... నిర్మలా సీతారామన్‌....

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ప్రత్యక్ష ఇన్సెంటివ్‌లు కల్పించేందుకు తక్కువ ఆదాయ పన్ను శ్లాబ్‌లు అమలు చేయాలని ఉపాధి కల్పనావకాశాలు మెరుగు పర్చాలని అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. నీల్సన్ డేటా ప్రకారం 2018 సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ సేల్స్ గ్రోత్ 16.2 శాతం కాగా, 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 7.2 శాతానికి పడిపోయింది. అంటే గత సెప్టెంబర్ త్రైమాసికంలో గ్రామీణ వినియోగం కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్ కోరికల మేరకు స్టిమ్యులేషన్ కల్పించడం సాధ్యమేనా? అన్న సందేహం కలుగుతోంది.
 

udget 2020-21 expectations: FMCG industry wants stimulus measures to push demand

న్యూఢిల్లీ: గ్రుహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఇంటి అవసరాలు తీర్చే ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే ప్రతి ఇల్లాలికి ఇష్టమే. కానీ ఇప్పుడు దేశమంతా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. అన్ని రంగాల పరిశ్రమల మాదిరిగానే ఎఫ్ఎంసీజీ సెక్టార్ పరిశ్రమలు కూడా డిమాండ్ లేక విలవిల్లాడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో డిమాండ్ పెంపొందించడానికి వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో స్టిమ్యులేషన్ ప్యాకేజీలు అమలులోకి తేవాలని ఎఫ్ఎంసీజీ సెక్టార్ విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరుతోంది. ఆదాయం పన్ను శ్లాబ్‌ల తగ్గింపు, ఉద్యోగాల కల్పన, గ్రామీణ వినియోగదారులకు ప్రత్యక్ష ఇన్సెంటివ్‌లు కల్పించాలని కోరుతున్నారు.

also read ‘2022 నాటికి అందరికి సొంతిల్లు’ ... కేంద్ర ఆర్థిక మంత్రి...

వచ్చే నెల ఒకటో తేదీన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఒకవైపు ఆదాయం పన్ను తగ్గించడంతోపాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), ఇతర భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను అమలులోకి తేవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెంపొందించడానికి చర్యలు చేపట్టాలని బ్రిటానియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. 

యూపీఏ తొలి విడుత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం కింద గ్రామాల్లో కనీసం 100 రోజులు యువతకు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ పెరుగడానికి వీలు కలుగుతుంది. 

udget 2020-21 expectations: FMCG industry wants stimulus measures to push demand

ఆర్థిక మందగమనంతోపాటు వ్యవసాయ రంగంలో తక్కువ ఆదాయం, ద్రవ్య లభ్యతకు ఆటంకాలు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోవడానికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. నీల్సన్ సంస్థ అధ్యయనం ప్రకారం ఎఫ్ఎంసీజీ సేల్స్ గ్రోత్ 2018 సెప్టెంబర్‌తో పోలిస్తే 16.2 శాతం నుంచి 7.3 శాతానికి పడిపోవడం గమనార్హం. 

2019 సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్ రూరల్ వినియోగం ఏడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో డాబర్ ఇండియా చైర్మన్ అమిత్ బర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ టాక్స్ మాదిరిగానే వ్యక్తిగత పన్ను తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. దేశీయంగా గ్రామీణ మార్కెట్లలో వాటికా శాంపో, రియల్ జ్యూస్ విక్రయాలు 45-47 శాతానికి పడిపోయాయి.

also read ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం చర్యలు...బ్యాంకుల విలీనాలు...

గత దశాబ్ద కాలంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎఫ్ఎంసీజీ గూడ్స్ వినియోగం ఎక్కువగా ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో 36 శాతం రూరల్ ఇండియాదే. ఇది పట్టణ ప్రాంతాల్లో వినియోగం కంటే 3-5 శాతం ఎక్కువ. 

వ్యర్థ ఖర్చులు తగ్గించి రోడ్లు, ఇళ్లు, నూతన ఫ్యాక్టరీల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించాలని తద్వారా ఉపాధి కల్పించడానికి మార్గం సుగమం అవుతుందని బిస్లరీ ఇంటర్నేషనల్ చైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఐదు శాతానికి పరిమితం అవుతుందని, ఇది గత పుష్కర కాలంలో అత్యంత కనిష్ఠం అని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios