భళా సుందరా.. పిచాయ్ ప్రమోషన్‌తో వారి ఖాతలోకి 200 కోట్లు!

By Sandra Ashok KumarFirst Published Dec 5, 2019, 2:36 PM IST
Highlights

గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కు సంస్థ వాటాల నుండి 1.7 బిలియన్ల లాభాన్ని పొందారు. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటల వరకు సంస్థ వాటాలు పెరిగిన తరువాత ఒక్కొక్కరికీ 800 మిలియన్ డాలర్లు వచ్చాయి. 

ఆల్ఫాబెట్ ఇంక్ నుండి తాము తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించిన గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్, న్యూయార్క్‌లో ఉదయం 10 గంటల వరకు సంస్థ వాటాలు పెరిగి ఒక్కొక్కరికీ 800 మిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి.

లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ సంస్థ వాటాలు నుండి 1.7 బిలియన్ల లాభాన్ని పొందారు. పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్ నుండి తాము తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించిన గూగుల్ సహ వ్యవస్థాపకులు, న్యూయార్క్‌లో ఉదయం 10 గంటల వరకు సంస్థ వాటాలు పెరిగిన తరువాత వారికి ఒక్కొక్కరికీ 800 మిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి.

also read  కార్వీపై బ్యాంకుల ఊరటకు ‘శాట్’నో...సెబీ వద్దకే వెళ్లండి

ఆల్ఫాబెట్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుందర్ పిచాయ్ వచ్చిన తరువాత దీన్ని పెట్టుబడిదారులు స్వాగతించడంతో ఈ లాభాలు వచ్చాయి. ఆపిల్ ఇంక్ సి‌ఈ‌ఓ టిమ్ కుక్ మరియు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సి‌ఈ‌ఓ సత్య నాదెల్లా లాగే సుందర్ పిచాయ్ కూడా దీర్ఘకాల కార్పొరేట్ దిగ్గజ సి‌ఈ‌ఓగా నిలిచాడు.

అతను మౌంటెన్ వ్యూ-ఆధారిత సంస్థలో చేరిన 15 సంవత్సరాల తరువాత,సెర్గీ బ్రిన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత సుందర్ పిచై  ప్రస్తుత సి‌ఈ‌ఓగా పదవిని చేపట్టారు. 1998 లో బ్రిన్ మరియు పేజ్ కలిసి కాలిఫోర్నియా గ్యారేజీలో ప్రారంభమైన ఈ సంస్థ 2018లో 137 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కలిగి ఉంది. నేడు దీని ప్రస్తుత మార్కెట్ విలువ 893 బిలియన్ డాలర్లు.  

also read ఆర్‌బీఐ గుడ్ న్యూస్...వడ్డీరేట్లు యథాతధం

అమెజాన్.కామ్ ఇంక్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ మరియు ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికీ సి‌ఈ‌ఓలుగా కొనసాగుతున్నారు, ప్రస్తుతం ఇవి మార్కెట్ విలువ ప్రకారం నాల్గవ, ఐదవ అతిపెద్ద కంపెనీలుగా నిలిచాయి.

click me!