షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త ! కరోనావైరస్ నెక్స్ట్ టార్గెట్ మీరే...

By Sandra Ashok KumarFirst Published Mar 13, 2020, 11:14 AM IST
Highlights

కరోనావైరస్ వేర్వేరు ఉపరితలాలపై ఎంతకాలం జీవించగలదు  అనే దానిపై  ఒక చర్చ జరిగింది. కొరోనావైరస్ మూడు రోజుల పాటు ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ పై  ఉండగలదని చెబుతున్నారు.

కొరోనావైరస్ మూడు రోజుల పాటు ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ మీద ఉండగలదని దాని వల్ల అది మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. కానీ రాగి వస్తువులపై మాత్రం ఈ వైరస్ సుమారు 4 గంటల వరకు ఉంటుంది. కొరియర్ ప్యాకేజీలు, స్మార్ట్‌ఫోన్ కేసులు, కంటైనర్లు పై  ఈ వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నారు.

కరోనావైరస్ వేర్వేరు ఉపరితలాలపై ఎంతకాలం జీవించగలదు  అనే దానిపై  ఒక చర్చ జరిగింది. కొరోనావైరస్ మూడు రోజుల పాటు ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ పై  ఉండగలదని చెబుతున్నారు.అయితే మీరు ఈ వైరస్ సోకిన పదార్థాలను ఎక్కడ కనుగొనవచ్చు? మీ ఇళ్లలో, ఆసుపత్రులలో, షాపింగ్ మాల్, ప్రజా రవాణాలో ఉంటుండొచ్చు. మోంటానాలోని హామిల్టన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వైరాలజీ ప్రయోగశాలలో పరిశోధకులు కొరోనావైరస్ సాధారణంగా ఏ ఏ వస్తువులపై ఎంతకాలం ఉంటుంది అనే దానిపై తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

also read కుప్పకూలిన పర్యాటక రంగం...దేశంలో వారికి వీసాల రద్దు...

ప్రపంచవ్యాప్తంగా 1,25,254 మంది కరోనావైరస్ సోకిన కేసులు ధృవీకరించారు. చైనాలో గరిష్టంగా కొనసాగుతోంది, చైనా ప్రధాన భూభాగంలో 80,932, హాంకాంగ్‌లో 129, మకావులో 10 కేసులు ఉన్నాయి. ఇటలీలో ఇప్పుడు 12,462 కేసులు, ఇటాన్‌లో 9,000 కేసులు, దక్షిణ కొరియాలో 7,869, ఫ్రాన్స్‌కు 2,284 కేసులు నమోదయ్యాయి.అమెరికాలో 1,312 కేసులు నమోదవగా, భారతదేశంలో 60 కేసులు నిర్ధారించారు. 

ఇలాంటి సమయంలో ఎలాంటి వస్తువులపై, ప్రాంతాలలో ఈ వైరస్ జీవించగలదు అని దానిపై ఖచ్చితంగ  చెప్పలేము, ఇది బాటమ్ లైన్, ”అని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజిస్ట్ మార్లిన్ రాబర్ట్స్ చెప్పారు.  "గాలి నుండి ఇంకా  ఉపరితలాలపై వైరస్ నేరుగా మరొకరికి  సోకే అవకాశాలు ఎక్కువ" అని నేషనల్ ఇన్స్టిట్యూట్స్‌లో విన్సెంట్ మన్స్టర్,  అతని బృందం తెలిపింది.

మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలని ఆరోగ్య అధికారులు సిఫార్సు చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్న ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. అలాగే, సబ్బుతో మీ చేతులను క్రమం తప్పకుండా కడగాలి, అలాగే మీ చేతులతో మీ ముఖాన్ని తాకకుండా ఉండండి.

also read స్టాక్స్ మార్కెట్ అల్లకల్లోలం...రూ.11 లక్షల కోట్లు హాంఫట్

అంతకుముందు జర్మనీలోని రుహ్ర్-యూనివర్సిటీ బోచుమ్ ఒక గది ఉష్ణోగ్రతలో ఈ వైరస్  ఉపరితలాలపై ఉండి, అది అంటు వ్యాధిల వ్యాపించొచ్చు. ఈ వైరస్ గది ఉష్ణోగ్రతలో తొమ్మిది రోజుల వరకు ఉండే అవకాశాలను సూచించారు. సగటున ఈ వైరస్ నాలుగు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది.

"తక్కువ ఉష్ణోగ్రత, అధిక గాలి తేమ ఉండటం వల్ల ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉండటానికి మరింత పెంచుతాయి" అని గ్రీఫ్స్వాల్డ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ నుండి ప్రొఫెసర్ గుంటర్ కాంప్ చెప్పారు. గత కొన్ని రోజులుగా కొన్ని ఆరోగ్యకరమైన కొరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో యు.కె ఆరోగ్య మంత్రి నాడిన్ డోరీస్ అలాగే నటులు టామ్ హాంక్స్ అతని భార్య రీటా విల్సన్  ఉన్నారు
 

click me!