లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు... రికార్డ్ స్థాయిలో ఇన్ఫోసిస్

By Sandra Ashok KumarFirst Published Jan 13, 2020, 2:30 PM IST
Highlights

ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 294 ఎగబాకి 41,893 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభపడి 12,337 వద్ద నిఫ్టీ 69.40 పాయింట్లు లేదా 0.57% పెరిగి 12326.20 వద్ద ట్రేడ్ అయింది. 779  షేర్లు లాభాల్లో, 175 షేర్లు నష్టాల్లో ఉండగా 64 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.  

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వైరం సమసిపోతున్న వేళ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఉదయం  స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 294 ఎగబాకి 41,893 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభపడి 12,337 వద్ద నిఫ్టీ 69.40 పాయింట్లు లేదా 0.57% పెరిగి 12326.20 వద్ద ట్రేడ్ అయింది. 779  షేర్లు లాభాల్లో, 175 షేర్లు నష్టాల్లో ఉండగా 64 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.  

also read కొత్త బడ్జెట్ లో భారీ నిధుల కేటాయింపులపైనే వారి ఆశలు...కానీ...?

ప్రారంభంలో మార్కెట్ లో లాభాలతో కొనసాగినా..ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గు ముఖం పట్టాయి. నిఫ్టీ 0.57శాతం పెరిగి 12,326.85తో కొనసాగుతుండగా సెన్సెక్స్ 257.62కు తగ్గి 41,857.34 వద్ద కొనసాగుతుంది.మార్కెట్లో ఇన్ఫోసిస్ సత్తా చాటుతోంది. ప్రారంభంలో షేర్ ధర 3శాతంపైగా లాభాలతో ప్రారంభమైంది. ఇప్పుడు అదే షేర్ ధర 5శాతం లాభాలతో కొనసాగుతుంది.

 

ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ (5%), హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా  మహీంద్రా & మహీంద్రా (మొత్తం 1%) అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు, టీసీఎస్ (0.5% డౌన్) అగ్రస్థానంలో ఉన్నాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1.6 శాతం పెరిగి అత్యధిక లాభాలను ఆర్జించింది.  మార్కెట్లో  ఎస్ అండ్ పి, బీఎస్ఇ, మిడ్ క్యాప్ 95 పాయింట్లతో  0.62 శాతం పెరిగింది.  ఎస్ & పి, బీఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 107 పాయింట్లతో  0.75 శాతం పెరిగింది.

also read వాల్ మార్ట్ ఇండియా స్టోర్లలో ఉద్యోగుల తొలగింపు...కారణం..?

 మల్టీ కమాడిటీ ఎక్సేంజ్ లో బంగారం ధర పెరిగింది. -165.00 పాయింట్లతో బంగారం ధర రూ. 39706.00కి చేరింది.  కిలో సిల్వర్ ధర -256 పాయింట్లతో రూ.46655.00 తో కొనసాగుతుండగా   సెంట్రమ్ క్యాపిటల్ 27.20 , టీవీ 18 23.95,సీసీఎల్ 146.20, బిర్లా కార్ప్న్. 698.00, వీఐపీ ఇండస్ 451.25, హిందూ ఎరోనాటిక్స్, 783.70, పీటీసీ ఇండియా 62.85, ఫోర్స్ మోటార్స్ 1235.00, మాక్స్ ఇండియా 80.55, సోమనీ సెరామిక్స్ 234.45,గేట్వే డిస్టర్,  128.10 టాటా కాఫీ 97.95,  రాడికో ఖైతాన్ 349.00, ఇండియాబుల్స్ ఇంటెగ్ 127.65 కంపెనీలు లాభాలతో కొనసాగుతున్నాయి.  

 

click me!