Closing Bell: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్, 897 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, కొంప ముంచిన బ్యాంకులు

Published : Mar 13, 2023, 03:40 PM IST
Closing Bell: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్, 897 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, కొంప ముంచిన బ్యాంకులు

సారాంశం

బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా, మార్చి 13, సోమవారం వరుసగా మూడో సెషన్‌లో నిఫ్టీ 17,200 దిగువన ముగిశాయి.

సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 897 పాయింట్లు నష్టపోయి 58,237.85 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 పాయింట్ల వద్ద ముగిసింది. IndusInd Bank, SBI, Tata Motors Ltd, Mahi & Mahi Eicher Motors టాప్ లూజర్లుగా నిలిచాయి. టాప్ గెయినర్లుగా Tech Mahindra, Apollo Hospitals, Britannia Ind, ONGC మాత్రమే నిలిచాయి. 

ఇక సెక్టార్ల పరంగా చూసినట్లయితే నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లోని కీలక సూచీలన్నీ కూడా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50 లోని వెయిటేజీ పరంగా బలమైన స్టాక్స్ గా పేరొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.43 శాతం నష్టపోయింది. అలాగే టీసీఎస్ 1.34 శాతం నష్టపోయింది. మార్కెట్ క్యాప్ పరంగా బలమైన స్టాక్స్ అయిన HDFC ద్వయం 1 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 50 సూచీలో టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ONGC, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ మినహా అన్ని షేర్లు నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి. 

 ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 2.34 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా నష్టపోయాయి. ప్రధానంగా SBI 3.36 నష్టపోయింి. అలాగే మరో కీలక బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సైతం 2 శాతం నష్టపోయింది. అలాగే మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC సైతం 1.30 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7.47 శాతం నష్టపోయింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 నుంచి 3 శాతం మధ్యలో నష్టపోయాయి. 

సోమవారం ఆటో స్టాక్స్ కూడా భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో సూచీ 2 శాతం నష్టపోయింది. స్టాక్స్ పరంగా చూసినట్లయితే, టాటా మోటార్స్ అత్యధికంగా 2.89 శాతం నష్టపయింది. అలాగే బజాజ్ ఆటో 1 శాతం, ఐషర్ మోటార్స్ 2.48 శాతం హీరో మోటో కార్ప్ 2.05 శాతం నష్టపోయింది. మరో ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2.38 శాతం నష్టపోయింది. 

నిఫ్టీ ఐటీ సూచీ కూడా భారీగా నష్టపోయింది. సుమారు 0.77 శాతం నష్టపోయింది. స్టాక్స్ పరంగా చూస్తే, టీసీఎస్ 1.35 శాతం నష్టోయింది. అలాగే ఇన్ఫోసిస్ అత్యధికంగా 2.26 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా ఒక్కటే 7 శాతం లాభపడింది.  బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం పడిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు