పేరు తెచ్చిన తంటా...అమెరికాకు చెందిన ఎస్వీబీ బ్యాంక్ కుప్పకూలడంతో ముంబై ఎస్వీబీ ఖాతాదారుల ఆందోళన..

Published : Mar 13, 2023, 01:27 PM IST
పేరు తెచ్చిన తంటా...అమెరికాకు చెందిన ఎస్వీబీ బ్యాంక్ కుప్పకూలడంతో ముంబై ఎస్వీబీ ఖాతాదారుల ఆందోళన..

సారాంశం

116 ఏళ్ల చరిత్ర ఉన్న ముంబయికి చెందిన ఎస్‌వీసీ బ్యాంక్‌ నిర్వహణ బోర్డు తమకు ఎలాంటి సమస్య లేదని పత్రికాముఖంగా చెప్పింది. బ్రాండ్ పేరులో కొంత పోలిక ఉందని తప్పుడు వార్తలను, వదంతులను నమ్మవద్దని, తమ కస్టమర్లకు బ్యాంకు విన్నవించుకుంది. 

ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( ఎస్‌విబి) బ్యాంక్ దివాళా తీయడం ముంబైలోని ఓ సహకార బ్యాంకుకు శాపంగా మారింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఎస్‌విబి కోఆపరేటివ్ బ్యాంక్ సైతం సిలికాన్ వ్యాలీ బ్యాంకుతో సంబంధం ఉందేమో అనే అనుమానంతో ఆ బ్యాంకు కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ రెండు బ్యాంకులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ రెండు బ్యాంకుల అబ్రిబేషన్ SVB కావడంతో ముంబైలని SVB సహకార బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళన చెందడం గమనార్హం. వార్తల్లో SVB బ్యాంకు అమెరికాలో దివాళా తీసిందనే వార్తలు వ్యాపించడంతో ముంబైలోని వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వివిధ శాఖలకు కాల్ చేసి ఆరా తీస్తున్నారు. అయితే అది ముంబైకి చెందిన SVB సహకార బ్యాంకు పూర్తి పేరు శ్యామ్ రావ్ విఠల్ రావ్ బ్యాంక్, తమ బ్యాంకుకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు మేనేజ్ మెంట్ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. 

116 ఏళ్ల చరిత్ర ఉన్న ముంబయికి చెందిన ఎస్‌వీసీ బ్యాంక్‌ నిర్వహణ బోర్డు తమకు ఎలాంటి సమస్య లేదని పత్రికాముఖంగా చెప్పింది. బ్రాండ్ పేరులో కొంత పోలిక ఉందని తప్పుడు వార్తలను, వదంతులను నమ్మవద్దని, తమ కస్టమర్లకు బ్యాంకు విన్నవించుకుంది. మా బ్రాండ్ పేరును కించపరిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు SVC బ్యాంక్‌కి ఉంది" అని SVC బ్యాంక్ సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. 

కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లచే నిషేధించబడిన US ఆధారిత సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో 1906లో స్థాపించబడిన SVC గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   వెంచర్-క్యాపిటల్ ఫైనాన్సింగ్‌లో ప్రత్యేకత కలిగిన SVB పతనం ప్రపంచ మార్కెట్లలో షాక్ వేవ్‌లను పంపింది. బ్యాంక్ కస్టమర్ డిపాజిట్లలో దాదాపు $175 బిలియన్లు ఇప్పుడు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా FDIC నియంత్రణలో ఉన్నాయి, సోమవారం ఉదయం అన్ని బ్యాంకు శాఖలు తెరిచిన తర్వాత డిపాజిటర్‌లకు వారి బీమా చేసిన డిపాజిట్‌లకు మాత్రమే యాక్సెస్ ఇస్తోంది. 

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదల కారణంగా పడిపోయిన సెక్యూరిటీ పొజిషన్ల లిక్విడేషన్‌కు దారితీసిన కస్టమర్ ఉపసంహరణల నుండి SVB సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వడ్డీ రేట్లు త్వరగా పెరగడం అంటే వారు కొనుగోలు చేసిన సెక్యూరిటీలు గణనీయంగా తక్కువగా అమ్ముడవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు