
ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం గత భారీ పతనాల నుంచి కోలుకున్న భారత స్టాక్ మార్కెట్ ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు ట్రేడింగ్ మిగిసే సమయానికి లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1328 పాయింట్లు లేదా 2.44 శాతం పెరిగి 55,858 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 410 పాయింట్లు పెరిగి 2.53 శాతం లాభంతో 16,658 వద్ద ముగిసింది. నేటి లాభాలతో ఇన్వెస్టర్లకు రూ.7 లక్షల కోట్ల లాభం వచ్చింది.
నేడు ట్రేడింగ్ ప్రారంభంలో
బిఎస్‌ఈ సెన్సెక్స్ 840 పాయింట్ల లాభంతో 57,370 స్థాయి వద్ద ప్రారంభమైంది, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 265 పాయింట్ల లాభంతో 16,504 స్థాయి వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 1600 పాయింట్ల వరకు లాభపడింది. దీంతో పాటు నిఫ్టీ ఇండెక్స్ కూడా రోజంతా లాభాలలో ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
గురువారం భారీ పతనం
చివరి ట్రేడింగ్ రోజున గురువారం రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం కారణంగా భారత స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం సంభవించింది. ఈ కారణంగా సెన్సెక్స్ 2702 పాయింట్లు నష్టపోయి 54,530 వద్ద ముగిసింది, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద పతనంతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ ఇండెక్స్ కూడా రోజంతా గడ్డు పరిస్థితిని ఎదుర్కొని 815 పాయింట్ల బలమైన పతనంతో 16,227 వద్ద ముగిసింది. ఒక్కరోజులో పెట్టుబడిదారులు రూ.13.5 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
నేడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభలో పయనించాయి. ఈ రోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా.. బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్ షేర్లు పడిపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు పిఎస్‌యూ బ్యాంక్, పవర్, మెటల్, రియాల్టీ సూచీలు 4-6 శాతం లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం పెరిగాయి.