Vladimir Putin:69 ఏళ్లలో కూడా జిమ్, స్విమ్మింగ్.. లగ్జరీ కార్ నుండి బ్లాక్ బెల్ట్ వరకు పుతిన్ లైఫ్ స్టయిల్..

Ashok Kumar   | Asianet News
Published : Feb 25, 2022, 05:00 PM IST
Vladimir Putin:69 ఏళ్లలో కూడా జిమ్, స్విమ్మింగ్.. లగ్జరీ కార్ నుండి  బ్లాక్ బెల్ట్ వరకు పుతిన్ లైఫ్ స్టయిల్..

సారాంశం

వ్లాదిమార్ పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌లోకి ప్రేవేశించి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వద్ద రష్యా సైన్యం ఉంది. రష్యా ఉక్రెయిన్  మధ్య యుద్దం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ను మోకాళ్ళ మీదకి  తేస్తుంది. 

ఈ రోజుల్లో ప్రపంచం మొత్తంలో ఏదైనా ప్రముఖ వ్యక్తి పేరు వినబడుతుందంటే అది ఒక్కరి పేరే, ఆ పేరు వ్లాదిమిర్ పుతిన్. వ్లాదిమిర్ పుతిన్ ఎవరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఉక్రెయిన్‌ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడికి ఆదేశించిన విషయం అందరికీ తెలుసు. పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌లోకి ప్రేవేశించి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వద్ద రష్యా సైన్యం ఉంది. రష్యా ఉక్రెయిన్  మధ్య యుద్దం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ను మోకాళ్ళ మీదకి  తేస్తుంది. రష్యా సైన్యం ఈ యుద్ధం చేస్తున్నప్పటికీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచనలు వారిని వెనుక నుండి నడిపిస్తున్నాయి. అతని కఠినమైన క్రమశిక్షణ,  విలాసవంతమైన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలు పుతిన్‌ను ఇతర అధ్యక్షులు లేదా నాయకుల నుండి భిన్నంగా చేస్తుందని మీకు తెలుసా..? 

ఈ విధంగా ఉదయం ప్రారంభం
చాలా మంది ప్రముఖ వ్యక్తులు తెల్లవారుజామున నిద్రలేస్తుంటారు, పుతిన్ మాత్రం ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు. వ్లాదిమిర్ పుతిన్ మధ్యాహ్నం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాడు. అతని పని గురించి చెప్పుకుంటే సాయంత్రం పనులు మొదలు పెడతారు. అంటే అతనికి రాత్రి పని చేయడానికి ఇష్టపడతారని అర్థం.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ
పుతిన్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడితే అతను ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అతడి వయసు 69 ఏళ్లు అయినప్పటికీ ఇంకా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్తాడు. అంతేకాకుండా, పుతిన్ మంచి ఈతగాడు కూడా,  అతను రోజుకు సుమారు 2 గంటల పాటు స్విమ్మింగ్ చేస్తాడు.

50 విమానాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు 50 విమానాలు ఉన్నాయి. అతనికి విమానాలను నడపడం అంటే ఇష్టం. కొన్నేళ్ల క్రితం రష్యా అడవుల్లో భీకర అగ్నిప్రమాదం జరిగినప్పుడు.. పుతిన్ స్వయంగా విమానాన్ని నడిపి అక్కడి నుంచి ప్రజలను రక్షించారు. అంతేకాకుండా, అతను రేసింగ్ కార్లు, సబ్ మెరైన్స్(sub marines) కూడా నడిపాడు.

ఆయుధాలంటే ఇష్టం
ఒక వైపు పుతిన్ ఐస్ హాకీతో సహా ఔట్ డోర్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడతాడు. మరోవైపు, అతనికి ఆయుధాలంటే కూడా చాలా ఇష్టం. దేశానికి కొత్త ఆయుధాలు వచ్చినప్పుడల్లా పుతిన్ స్వయంగా వాటిని ప్రయోగిస్తాడు.

జూడోలో బ్లాక్ బెల్ట్
వ్లాదిమిర్ పుతిన్ జూడోలో బ్లాక్ బెల్ట్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా, పుతిన్ వేటాడటం (hunting)ఇష్టపడతాడు ఇంకా  అతను గొప్ప వేటగాడు కూడా. రోజూ అడవికి వేటకు వెళ్తుంటారు.

వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా 
వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినట్లయితే, అతను వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతాడు. అయినప్పటికీ ఫోటోలు, వ్యక్తిగత  విషయాలు చాలా మీడియా నివేదికలలో కనిపిస్తాయి. 1993లో అతను వృత్తిరీత్యా విమాన సహాయకురాలు లియుడ్మిలా ష్క్రెబెనెవాను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ 31 ఏళ్ల వివాహ బంధం 2014లో తెగిపోయింది.

20 విలాసవంతమైన ఇళ్లులు
మీడియా నివేదికల ప్రకారం, 2012 నాటికి పుతిన్‌కు 20 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ఈ విలాసవంతమైన ఇళ్ళులు మాస్కో, ఫిన్లాండ్ ఇంకా  ఎన్నో ఇతర ప్రదేశాలలో ఉన్నాయి.  అప్పట్లో పుతిన్ సౌత్ ఈస్టేర్న్ ఐరోపాలోని నల్ల సముద్ర తీరంలో  విలాసవంతమైన ఇల్లు కారణంగా ముఖ్యాంశాలలో నిలిచారు. అప్పట్లో దీని ధర 950 మిలియన్ డాలర్లు అంటే ఇండియాలో సుమారు 95కోట్లు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్