PF లిమిట్ పెంచుతారా, బడ్జెట్‌లో కీలక ప్రకటన.. 10 ఏళ్ల తరువాత మళ్లీ ..

By Ashok Kumar  |  First Published Jul 5, 2024, 1:21 PM IST

పీఎఫ్‌లో చేరే ఉద్యోగుల వేతన పరిమితిని బడ్జెట్‌లో పెంచే వచ్చని సూచించింది. ప్రావిడెంట్ ఫండ్ లేదా PF అనేది కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్  & రిటైర్మెంట్ ఫండ్.
 


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి బడ్జెట్‌-2024లో భారీ ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులు పీఎఫ్‌లో చేరేందుకు వేతన పరిమితిని పెంచవచ్చు. ప్రస్తుతం PF పరిమితి రూ. 15,000. దీన్ని ఇప్పుడు పదేళ్ల తర్వాత  రూ.25,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ ఒక సిఫార్సును సిద్ధం చేసినట్లుగా సమాచారం.
 
ప్రావిడెంట్ ఫండ్ లేదా PF అనేది కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ & రిటైర్మెంట్ ఫండ్. ఉద్యోగులు నెలవారీ వేతనంలో కొంత భాగాన్ని (సాధారణంగా వారి ప్రాథమిక జీతంలో 12 శాతం + డియర్‌నెస్ అలవెన్స్) EPF అకౌంట్లో జమ చేస్తారు. కంపెనీలు ఈ  సమాన మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత అందజేస్తాయి. అంతే కాకుండా, ఈ మొత్తానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయించే ఫిక్స్డ్  వడ్డీ రేటు అందిస్తుంది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. ప్రావిడెంట్ ఫండ్‌ పరిమితి ప్రస్తుతం రూ.15,000, అంటే నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనం ఉంటే పీఎఫ్‌లో భాగం కావాలి. దీనిని రూ.25,000గా చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

జీతం పరిమితి పెరుగుదల చరిత్ర

Latest Videos

1 నవంబర్ 1952 నుండి 31 మే 1957 వరకు రూ.300

1 జూన్ 1957 నుండి 30 డిసెంబర్ 1962 వరకు రూ.500

31 డిసెంబర్ 1962 నుండి 10 డిసెంబర్ 1976 వరకు రూ.1000

11 డిసెంబర్ 1976 నుండి 31 ఆగస్టు 1985 వరకు రూ.1600

1 సెప్టెంబర్ 1985 నుండి  31 అక్టోబర్  1990 వరకు రూ.2500 

1 నవంబర్   1990 నుండి 30 సెప్టెంబర్ 1994 వరకు రూ.3500

1 అక్టోబర్ 1994 నుండి 31 మే 2011 వరకు రూ.5000

1 జూన్ 2001 నుండి 31 ఆగస్టు 2014 వరకు రూ.6500

1 సెప్టెంబర్ 2014 నుండి రూ.15000.

ఇక స్టాక్ మార్కెట్ రోజుకో కొత్త శిఖరాలను కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రాబోయే యూనియన్ బడ్జెట్ ప్రకటనల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందనే దానిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉన్నారు. ప్రభుత్వ వ్యయం, కంపెనీల పనితీరు మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు 20 శాతం లాభపడతాయని నిపుణులు చెబుతున్నారు.

రానున్న బడ్జెట్‌లో వినియోగదారుల వ్యయాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలు ఉంటాయని అంచనా. దీంతోపాటు బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడతాయని నేషనల్ మీడియా బ్లూమ్ బర్గ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ 26,000 పాయింట్లను దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నిఫ్టీ 12 శాతం లాభపడింది.

click me!