Sovereign Gold Bond: కారు చౌకగా బంగారం కొనాలని ఉందా..అయితే మరో రెండు రోజులకే చాన్స్...త్వరపడండి..

Published : Mar 02, 2022, 03:11 PM IST
Sovereign Gold Bond: కారు చౌకగా బంగారం కొనాలని ఉందా..అయితే మరో రెండు రోజులకే చాన్స్...త్వరపడండి..

సారాంశం

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా, అయితే నగల రూపంలో కానీ, బిస్కెట్లు, నాణేల రూపంలో కానీ కొనుగోలు చేయడం ద్వారా వాటి నుంచి ఆదాయం పొందడం కష్టం అనే చెప్పాలి. ఫిజికల్ గోల్డ్ పెట్టి రుణం తీసుకున్న ఎక్కువ రుణం పొందలేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసే సావరీన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు వడ్డీ రూపంలో ఆదాయం అలాగే పన్ను మినహాయింపు కూడా దక్కుతుంది.

Sovereign Gold Bond Scheme: మోదీ ప్రభుత్వం మరోసారి సామాన్యులకు, పెట్టుబడిదారులకు బంగారాన్ని చౌకగా విక్రయించేందుకు గానూ, సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీం ప్రవేశపెట్టింది. సంవత్సరం చివరి సిరీస్ అయిన సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలు ఫిబ్రవరి 28 సోమవారం నుండి ప్రారంభం కాగా,  మార్చి 4న ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చౌకగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి మీకు రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఈసారి ఒక గ్రాము బంగారం ధర రూ.5,109గా నిర్ణయించారు. మీరు ఆన్‌లైన్ చెల్లింపుపై రూ. 50 తగ్గింపును కూడా పొందుతారు, అంటే, మీరు రూ. 5059 చెల్లించాలి, కాబట్టి మీకు మరియు పెట్టుబడిదారులకు మంచి అవకాశం ఉంది.

అతి తక్కువ ధరకే బంగారం..
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్, ఇందులో పెట్టుబడిదారుడు భౌతిక రూపంలో బంగారాన్ని పొందడు. అయితే, ఈ బంగారం భౌతిక బంగారం కంటే సురక్షితమైనది. ప్రస్తుతం మార్కెట్‌లో 1 గ్రాము బంగారం ధర రూ.5100గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం బంగారాన్ని చౌకగా విక్రయిస్తోంది.

బంగారం బాండ్లను ఎలా కొనాలి
మీరు NSE, BSE వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీ స్వంత బ్యాంకు, ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ బ్యాంకులు కూడా బంగారు బాండ్లను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తాయి. దీనిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) నుండి లేదా పోస్టాఫీసుల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. 

వడ్డీ కూడా పొందుతారు
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. తదుపరి వడ్డీ చెల్లింపు తేదీలో 5 సంవత్సరాల తర్వాత బాండ్ నుండి పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మీరు 1 గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇష్యూకి ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి 6 నెలలకు మీ ఖాతాలో జమ చేయబడుతుంది.

పన్ను మినహాయింపు పొందండి
దీని అమ్మకంపై వచ్చే లాభం ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మినహాయింపుతో పాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వం గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ ఎపిసోడ్. మే నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

2015లో పథకం ప్రారంభమైంది
ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. సావరిన్ గోల్డ్ బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలు. ఈ పథకాన్ని భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రారంభించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు
Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు