LIC IPO: ఎల్ఐసీ ఐపీవో కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారా..అయితే మీ ఆశలపై రష్యా బాంబులు పడ్డట్టే...

Published : Mar 02, 2022, 02:28 PM IST
LIC IPO: ఎల్ఐసీ ఐపీవో కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారా..అయితే మీ ఆశలపై రష్యా బాంబులు పడ్డట్టే...

సారాంశం

రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లపైనే కాదు, దేశీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఐపీవోలపై కూడా దీని ప్రభావం బలంగా పడనుంది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న LIC IPO సైతం వాయిదా పడే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. 

LIC IPO: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) భారత ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇప్పటికే భారీ కరెక్షన్ కొనసాగుతోంది. సెన్సెక్స్ ఏకంగా బుధవారం డే లోస్థాయిలో 1200 పాయింట్ల వరకూ పతనం అయి కొద్ది పాటి రికవరీ నమోదు చేస్తోంది. అయితే అటు IPO మార్కెట్లపై కూడా దీని ప్రభావం పడనుంది. ఇది నిజంగా ఐపీవో పెట్టుబడిదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకులకు భయపడిన ప్రభుత్వం, LIC IPOని వాయిదా వేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

వాస్తవానికి మార్చి నెలాఖరులోగా ఐపీఓను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని వాయిదా  భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. IPOపై తుది కాల్ తీసుకోవడానికి ప్రభుత్వం ఈ వారంలో ఒక సమావేశాన్ని నిర్వహించనుంది. దీనిలో LIC లిస్టింగ్ ఈ సంవత్సరం మార్చిలో జరుగుతుందా లేదా అనేది నిర్ణయించనున్నారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఐపీఓ జారీ చేసే సమయాన్ని  మార్చవచ్చని ఈ విషయానికి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు.

సీతారామన్ కూడా సంకేతాలు ఇచ్చారు.. (FM Nirmala Sitharaman)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవలే ఓ సమావేశంలో చెబుతూ... మేము మునుపటి ప్రణాళిక ప్రకారం వెళ్లాలనుకుంటున్నాము, ఎందుకంటే ఇది భారతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ, ప్రపంచ మార్కెట్ల పరిస్థితి క్షీణిస్తే, IPO  సమయాన్ని పునఃపరిశీలిన చేసే వీలుందని సూచన చేశారు.  IPO కోసం కంపెనీ ఫిబ్రవరి 13న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి DRHPని సమర్పించింది.

పెద్ద పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి
LIC IPOలో డబ్బును పెట్టే పెద్ద పెట్టుబడి బ్యాంకులు లిస్టింగ్‌ను వాయిదా వేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్‌లో ఇంకా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయని, ఇది ఐపీఓ లిస్టింగ్ పై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. వాయిదా పడిన తర్వాత, మార్కెట్లో స్థిరత్వం వచ్చిన తర్వాత, మదుపుదారుల విశ్వాసం కూడా మరింత పెరుగుతుంది, అప్పుడు ఐపీవో  ప్రయోజనం పొందుతుందని సూచిస్తున్నారు.

విదేశీ మదుపుదారులు కూడా దూరం అయ్యే చాన్స్...
మార్కెట్ అస్థిరత మధ్య విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలను సమీక్షిస్తున్నారని ఎల్‌ఐసి ఐపిఓపై పనిచేస్తున్న బ్యాంకర్ తెలిపారు. అటువంటి సమయంలో, వారు ఈ IPOకు దూరం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది షేర్ల పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు