వామ్మో వాచ్ ఇన్ని కోట్లా! ఆశ్ఛర్యపోతున్న నెటిజన్లు.. సోషల్ మీడియా వైరల్

By Ashok Kumar  |  First Published Jul 2, 2024, 9:41 AM IST

రిచర్డ్ మిల్లె.. ఈ అత్యంత అరుదైన వాచ్ కంపెనీ ఇప్పటివరకు 18 మాత్రమే తయారు చేసింది. అందులో ఒకటి అనంత్ అంబానీ ధరించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
 


రిలయన్స్ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌  గ్రాండ్ వెడ్డింగ్ ఈ నెల 12న జరగనుంది.

14వ తేదీ వరకు అంటే జూన్ 12 నుండి 3 రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుకలు జరుగుతాయి. ఈ తరుణంలో అనంత్ అంబానీ ఆదివారం మహారాష్ట్రలోని నేరల్‌లో కృష్ణకాళి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

Latest Videos

అక్కడ హవన్ కార్యక్రమాన్ని నిర్వహించి పెళ్ళికి దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ ఆలయాన్ని సందర్శించినప్పుడు ధరించిన వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లే వాచ్ ధరించినట్లు చెప్పారు. ఈ వాచ్ ధర అక్షరాలా రూ.6.91 కోట్లు. అలాగే, అనంత్ అంబానీ దగ్గర ఫేమస్ బ్రాండ్‌లకు చెందిన చాలా ఖరీదైన వాచీలు ఉన్నాయి.

రిచర్డ్ మిల్లె ఇలాంటి అత్యంత అరుదైన వాచ్‌లను ఇప్పటివరకు 18 మాత్రమే తయారు చేశారు. అందులో ఒకటి  ఆనంద్ అంబానీ ధరించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

కొన్ని నెలల క్రితం, అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తన ప్రీ వెడ్డింగ్ బాష్ సందర్భంగా 18 కోట్ల రూపాయల విలువైన వాచ్‌ను ధరించారు.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు హాజరైన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అతని భార్య ఇద్దరూ అనంత్ అంబానీ వాచ్‌ చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

click me!