వారెన్ బఫెట్ తన మరణానంతరం బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు కొనసాగించబోదు. సంపదంతా అతని ముగ్గురు పిల్లలు నిర్వహించే కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేటాయించనున్నారు.
బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, బిలియనీర్ వారెన్ బఫెట్ ప్రాస్పెక్టస్(prospectus)ను సవరించారు. వారెన్ బఫెట్ తన మరణం తరువాత బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు కొనసాగించదని, అతని సంపదను అతని ముగ్గురు పిల్లల కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేటాయిస్తారని స్పష్టం చేశారు. అయితే, 93 ఏళ్ల వారెన్ బఫెట్ పిల్లల్లో ఒక్కొక్కరికీ ఒక్కో స్వచ్ఛంద సంస్థ ఉంది.
దీనిపై వారెన్ బఫెట్ మాట్లాడుతూ .. ‘‘నా ముగ్గురు పిల్లల పని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు బాగా చేస్తారనే నమ్మకం నాకు 100 శాతం ఉంది’’ అని అన్నారు.
undefined
వారెన్ బఫెట్ 9,000 క్లాస్ A షేర్లను 13 మిలియన్ క్లాస్ B షేర్లుగా మారుస్తున్నట్లు బెర్క్‌షైర్ హాత్వే ఇటీవల ప్రకటించింది. ఇందులో దాదాపు 9.3 మిలియన్ షేర్లు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు కేటాయిస్తారు. మిగిలిన 4మిలియన్ షేర్లు వారెన్ బఫెట్ కుటుంబ సభ్యుల స్వచ్ఛంద సంస్థల మధ్య పంపిణీ అవుతాయి. గత సంవత్సరం, వారెన్ బఫెట్ తన కుటుంబానికి చెందిన నాలుగు స్వచ్ఛంద సంస్థలకు సుమారు $870 మిలియన్లు, 2022లో దాదాపు $750 మిలియన్లు విరాళంగా ఇచ్చారు.
కొత్తగా ప్రకటించిన ఈ సహకారాన్ని అనుసరించి, వారెన్ బఫెట్‌కి ఇప్పుడు 2,07,963 బెర్క్‌షైర్ హాత్వే క్లాస్ A షేర్స్, 2,586 క్లాస్ B షేర్స్ ఉన్నాయి, దీని మొత్తం విలువ సుమారు $128 బిలియన్లు.