ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ? తీసుకుంటే ఇవీ లాభాలు

By Ashok KumarFirst Published Jul 2, 2024, 9:35 AM IST
Highlights

ఇప్పుడు ఒక్క క్లిక్‌తో ప్రజలు హెల్త్  ఇన్సూరెన్స్ ను అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాలసీలను పోల్చి చూడవచ్చు  అంతేకాదు అత్యంత అనుకూలమైది సెలక్ట్ చేసుకోవచ్చు.
 

హెల్త్ విషయంలో ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ రోజుల్లో హెల్త్  ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో ప్రజలు హెల్త్  ఇన్సూరెన్స్ ను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాలసీలను పోల్చి చూడవచ్చు. అంతేకాదు, మీకు అత్యంత అనుకూలమైది సెలక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం... 


1. ఎక్కువ అవకాశాలు

Latest Videos

చాల వరకు  హెల్త్  ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్నో రకాల   ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్   ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫారమ్స్ మీ అవసరాలు, బడ్జెట్, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వివిధ కంపెనీల ప్లాన్‌లను పోల్చి చూడడానికి  మీకు సహాయపడతాయి. దీని ద్వారా  ప్రతి పాలసీ లాభాలు, నష్టాలను అర్థం చేసుకోవచ్చు.  

2. పోలికలు

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఒకే స్క్రీన్‌పై పోల్చి చూడడానికి సహాయం చేస్తాయి. ఇంకా ప్రతి పాలసీ స్పెసిఫికేషన్‌లు, కవరేజ్ సమాచారం, ధర ఒకేసారి స్పష్టంగా చూడటానికి  సహాయపడుతుంది.

3. ఖర్చు 

ఏజెంట్ కమీషన్‌లతో సహా వివిధ అంశాల కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్  తినుకునే చేసే మార్గాలు ఎక్కువ ఖర్చులకు దారితీస్తాయి. ఆఫీసులు లేదా ఏజెంట్లు లేనందున ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ తక్కువకే ప్రీమియంలను అందిస్తాయి.  

4. కొనడం ఈజీ 

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే  పద్ధతికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. మీరు ఆన్‌లైన్‌లో  హెల్త్ ఇన్సూరెన్స్  తీసుకుంటే మీరు పర్సనల్  పాలసీలను చూడవచ్చు ఇంకా  పోల్చవచ్చు & మీకు కావలసినప్పుడు పాలసీని కొనవచ్చు.

5. ట్రాన్స్పరెంట్  

ఆన్‌లైన్ ఇన్సూరెన్స్  ప్లాట్‌ఫామ్‌ల ప్రధాన ప్రయోజనం ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ  కవరేజ్, మినహాయింపులు, తగ్గింపులు & క్లెయిమ్, సెటిల్‌మెంట్ రేషియో తెలుసుకోవచ్చు. ప్లాన్లను  డైరెక్ట్‌గా పోల్చడం, వాటి కవరేజీలో తేడాలను అర్థం చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. 

6. ఇన్స్టంట్ కవరేజ్

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే పాలసీలు దాదాపు వెంటనే జారీ అవుతాయి. 

7. సెక్క్యూరిటీ  

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు పర్సనల్ సమాచారాన్ని రక్షించడానికి ఎన్‌క్రిప్షన్ ప్రోటోకాల్‌లను ఉపయోగిస్తాయి. దీని ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం రక్షించబడుతుంది.  

click me!