స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి 2024లో ఎలక్ట్రిక్ కారు విడుదలకు సిద్ధం, ఒక్క చార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్..

By Krishna Adithya  |  First Published Mar 10, 2023, 5:55 PM IST

స్మార్ట్‌ఫోన్‌లు , టెలివిజన్‌లు ,  వాక్యూమ్ క్లీనర్‌ల తర్వాత, చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దీని మొదటి మోడల్, Xiaomi Modena లేదా MS11 అనే కోడ్ నేమ్ కలిగిన సెడాన్ త్వరలో ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.


Xiaomi 2024 ప్రథమార్థంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు  ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఇటీవలే పేర్కొంది.  చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ Xiaomi సహ వ్యవస్థాపకుడు ,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 నాటికి కంపెనీ తన EV వెంచర్‌లో మూడు బిలియన్ యువాన్లను (434.3 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిందని, కంపెనీ తన సమయంలో సగ భాగం షియోమీ EV కారు  వ్యాపారం గురించే ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. 

ఈ ఎలక్ట్రిక్ కారు అధికారిక ఆవిష్కరణకు ముందు, తొలి మోడల్ ,  చిత్రాలు వెలువడ్డాయి. షియోమీ కారు 2024లో ఉత్పత్తిలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు, MS11 ఎలక్ట్రిక్ కారు ఇటీవల ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో ఈ కారు డిజైన్ కనిపిస్తోంది. ఇతర ప్రముఖ గ్లోబల్ మోడళ్ల ప్రభావం కూడా దీని డిజైన్ వెనుక ఉన్నట్లు సమాచారం.

Latest Videos

నాలుగు-డోర్ల ఎలక్ట్రిక్ సెడాన్ ప్రవహించే   ఏరోడైనమిక్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, LED లైట్లు త్రిశూల ఆకారంలో ఉన్నాయి. దీని స్పోర్ట లుక్ కారు దూకుడు రూపాన్ని ఇస్తోంది. ఇది మెక్‌లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

Xiaomi MS11 పెద్ద విండ్‌షీల్డ్ ,  మంచి సైడ్ గ్లాస్ ఏరియాను కలిగి ఉంది. ఇది వెనుకకు విస్తరించే పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంది. ఇది చక్రాల మధ్యలో Xiaomi లోగోను కలిగి ఉంది, ఇది పసుపు రంగు బ్రెంబో బ్రేక్ కాలిపర్‌లతో వస్తుంది. విండ్‌షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. కారు వెనుక విస్తృత వంపులు ఉన్నాయి. ప్యాసింజర్ క్యాబిన్ వెనుక భాగంలో కొద్దిగా ఇరుకైనది. టెయిల్‌లైట్‌లు ఆస్టన్ మార్టిన్ లాంటి డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

లీకైన చిత్రాల్లో, ఇంటీరియర్, సహా ఇతర టెక్నికల్ ఫీచర్ల  గురించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు.  Xiaomi తన మొదటి ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసే చివరి దశలో ఉన్నట్లు సమాచారం. చైనీస్ రోడ్లపై ,  శీతాకాలపు పరీక్షల సమయంలో ఈ కారు అనేక సార్లు గుర్తించినట్లు తెలుస్తోంది . Xiaomi MS11 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. దీని బ్యాటరీలు BYDతో సహా కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. Xiaomi కూడా ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని పేర్కొంది. EV దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్‌తో వస్తుంది.

click me!