ఎలాన్ మస్క్ కు షాక్, మార్కెట్లో అత్యధికంగా సేల్స్ జరిగే టెస్లా 3470 Y మోడల్ కార్ల రీకాల్..సీటు బెల్టులో లోపాలు

Published : Mar 05, 2023, 02:44 PM IST
ఎలాన్ మస్క్ కు షాక్, మార్కెట్లో అత్యధికంగా సేల్స్ జరిగే టెస్లా 3470 Y మోడల్ కార్ల రీకాల్..సీటు బెల్టులో లోపాలు

సారాంశం

సీటు బెల్టులో లోపాలను గుర్తించిన తర్వాత  టెస్లా 3470 Y మోడల్ కార్లను రీకాల్ చేసింది.  ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో టెస్లా శనివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 

కాలిఫోర్నియా: టెస్లా వై మోడల్‌లోని 3470 కార్లను రీకాల్ చేసింది. యుఎస్‌లో విక్రయించే రెండవ వరుస కార్లలో సీట్ బోల్ట్‌లు సరిగ్గా బిగించలేదని గుర్తించిన తర్వాత ఇది జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్టులో లోపాలను గుర్తించినట్లు ప్రజల నుంచి విస్తృతంగా ఫిర్యాదులు రావడంతో టెస్లా శనివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ లోపం సీటు బెల్ట్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వివరించింది.

దీంతో ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ నుండి ఐదుగురు వ్యక్తులు వారంటీ కోసం కంపెనీని సంప్రదించారని టెస్లా పేర్కొంది. అయితే, ఈ ప్రమాదాల్లో ఎవరూ గాయపడినట్లు గుర్తించలేదని టెస్లా పేర్కొంది. టెస్లా మోడల్ Y అనేది టెస్లా రెండవ బెస్ట్ సెల్లర్, ప్రతి గంటకు 11 యూనిట్ల కంటే ఎక్కువ అమ్ముడవుతోంది. ప్రస్తుతం బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనం అయిన మోడల్ Y కొన్ని వెర్షన్‌లపై దాదాపు 20 శాతం ధరలను తగ్గించిన మూడు వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

కొద్ది రోజుల క్రితం, వాహనం నడుపుతున్నప్పుడు టెస్లా మోడల్ Y కారు స్టీరింగ్ ఆఫ్ కంప్లైంట్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. న్యూజెర్సీకి చెందిన కారు యజమాని ప్రేరక్ పటేల్. అతను, అతని కుటుంబం చాలా కాలంగా ఎదురుచూస్తున్న టెస్లా మోడల్ Y డెలివరీ తీసుకొని, కొన్ని రోజుల తర్వాత భయానక అనుభవం ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

షాపింగ్ మాల్‌ను విజిట్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా, ఎలక్ట్రిక్ SUV స్టీరింగ్ వీల్ అకస్మాత్తుగా హైవేపై లూజ్ అయిందని పేర్కొన్నాడు. అయితే ఈ ప్రమాదంలో తమ కుటుంబం అదృష్టవశాత్తూ బయటపడిందన్నారు. రోడ్డుపై రద్దీ తక్కువగా ఉండటం, ఈ ఘటనలో ఎవరికీ శారీరకంగా గాయాలు కాకపోవడంతో అతను తన టెస్లా మోడల్ వైని రోడ్డు పక్కన సురక్షితంగా పార్క్ చేశామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !