మళ్లీ ట్రేడింగ్ హాల్టింగ్.. 10 % లోయర్ సర్క్యూట్ వల్ల.. అమ్మకాల ఒత్తిళ్లే!!

By narsimha lodeFirst Published Mar 23, 2020, 10:37 AM IST
Highlights

జనతా కర్ఫ్యూతోపాటు కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత సోమవారం ప్రారంభమైన దేశీయ స్టాక్  మార్కెట్లు చతికిల పడ్డాయి

ముంబై: జనతా కర్ఫ్యూతోపాటు కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత సోమవారం ప్రారంభమైన దేశీయ స్టాక్  మార్కెట్లు చతికిల పడ్డాయి.  అటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఇటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా మరోసారి మహా పతనాన్ని నమోదు చేశాయి. 

ఉదయం 10.04 గంటలకు సెన్సెక్స్ 2991.85 పాయింట్లు పతనమైంది. రూపాయి ఫారెక్స్ మార్కెట్లో డాలర్ పై మారకం విలువ ఉదయం 9.13 గంటలకు రూ.76కు చేరి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 842.45 పాయింట్లు కోల్పోయింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈలో ఇండెక్స్ లన్నీ పది శాతం పతనం కావడంతో 45 నిమిషాల సేపు ట్రేడింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్ఈ ట్రేడింగ్ నిలిపివేయడం ఈ నెలలో రెండోసారి. తిరిగి ట్రేడింగ్ ఉదయం 10.42 గంటలకు ప్రారంభం కానున్నది. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారిలో విశ్వాసం కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, లాక్ డౌన్ ప్రకంపనలతో కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి. 

సెన్సెక్స్ 2687 పాయింట్లు  పతనం కాగా  నిఫ్టీ నిఫ్టీ 874 పాయింట్ల నష్టంతో వద్ద  ట్రేడింగ్ అరంభించాయి. తద్వారా  సెన్సెక్స్  28వేల స్థాయిని, నిఫ్టీ 8వేల స్థాయిని కోల్పోయి 7903 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే  ఫార్మ రంగ షేర్ల లాభాలతో సూచీలు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. 

also read:కరోనా ముప్పు: ఔషధ భద్రతే ప్రధానం.. రూ.14 వేల కోట్ల ప్యాకేజీ

లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ల షేర్లు పేకమేడలా కూలిపోయాయి. 150కి పైగా షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. ఇన్వెస్టర్లు రూ.10.15 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లు కోల్పోయింది. 

నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు 10 శాతానికి పైగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సేర్లు 9 శాతానికి పైగా నష్టపోయాయి. నెస్లె ఇండియా 4.65 శాతం నష్టపోయింది. శ్రీ సిమెంట్, ఆల్ట్రా సిమెంట్స్ 13 శాతానికి పైగా, ఆదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు సుమారు 20 శాతం నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాక్, ఐటీసీ, గ్రాసిం ఇండస్ట్రీస్ 10 శాతం పతనమయ్యాయి. 

click me!