నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. 66,017.81 వద్ద సెన్సెక్స్, 19802 వద్ద నిఫ్టీ...

By asianet news teluguFirst Published Nov 23, 2023, 4:49 PM IST
Highlights

స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గురువారం రోజంతా మందకొడిగా ట్రేడవుతూ చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 5.43 (0.00%) శాతం పడిపోయి 66,017.81 వద్ద, నిఫ్టీ 9.85 (0.05%) పాయింట్లు పడిపోయి 19,802.00 వద్ద ముగిసింది.
 

ఈ వారంలోని నాలుగో ట్రేడింగ్ రోజున గురువారం స్టాక్ మార్కెట్‌లో ఫ్లాట్ ట్రేడింగ్ జరిగింది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు రోజంతా మందకొడిగా ట్రేడవుతూ చివరికి నష్టాల్లో ముగిశాయి. గురువారం, సెన్సెక్స్ 5.43 (0.00%) శాతం పడిపోయి 66,017.81 వద్ద, నిఫ్టీ 9.85 (0.05%) పాయింట్లు పడిపోయి 19,802.00 వద్ద ముగిసింది. ఈ సమయంలో బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అంతకుముందు బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 66,023 వద్ద ముగిసింది.

ఉదయం స్టాక్ మార్కెట్ మంచి అంతర్జాతీయ సంకేతాల కారణంగా, ప్రధాన మార్కెట్ సూచీలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి. ఈ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి 66,130 స్థాయికి చేరింది. మరోవైపు నిఫ్టీ కూడా 33 పాయింట్ల లాభంతో 19,850 దగ్గర ట్రేడైంది.  బ్యాంకింగ్, ఆటో రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్ బలపడింది. నిఫ్టీలో బజాజ్ ఆటో 2% లాభంతో టాప్ గెయినర్‌గా ట్రేడైంది. అంతకుముందు బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 92 పాయింట్లు పెరిగి 66,023 పాయింట్ల వద్ద ముగిసింది.

Latest Videos

 స్మాల్‌క్యాప్ అండ్  మిడ్‌క్యాప్ స్టాక్‌ల నేతృత్వంలో లాభాలతో  సూచీలు సానుకూలంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 127.90 పాయింట్లు లేదా 0.29% పెరిగి 43,577.50 వద్ద స్థిరపడింది. ఇతర రంగాల సూచీలలో ఆయిల్ & గ్యాస్ అలాగే  మెటల్ స్టాక్‌లు లాభపడగా, ఫార్మా అండ్ హెల్త్‌కేర్ స్టాక్స్ నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బిపిసిఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అలాగే  ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్లు కాగా, సిప్లా, అల్ట్రా టెక్ సిమెంట్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ,  లార్సెన్ & టూర్బో లూజర్స్ గా  ఉన్నాయి. 

ఆస్ట్రేలియా  ఇండెక్స్ 0.1 శాతం, తైవాన్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు స్వల్పంగా 0.2 శాతం చొప్పున క్షీణించాయి.

ట్రేడింగ్ రోజులో ఆటోమొబైల్ దిగ్గజాలు చెప్పుకోదగ్గ పనితీరును కనబరిచారు, హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటోలు ఒక్కొక్కటి 3 శాతానికి పైగా లాభపడ్డాయి, పండుగ సెషన్‌లలో బలమైన అమ్మకాలు వృద్ధి చెందాయి.

click me!