బేబీ వాటర్ కోసం 19 వేలు ! నెటిజన్లు ఫైర్.. ఈ ఆలోచనను మెచ్చుకుంటున్న వ్యాపారాలు.. !

By asianet news telugu  |  First Published Nov 22, 2023, 5:23 PM IST

పిల్లల ఉత్పత్తుల ధర కొంచెం ఎక్కువే ఉంటాయి. అలాగే బ్యూటీ ప్రొడక్ట్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే పరిమళాలు వెదజల్లే నీళ్లకు ఇంత ధర ఎవరు చెల్లిస్తారో తెలియదు మరి. 
 


ఒక బ్యూటీ ప్రొడక్ట్ కొనడానికి ఒకటి లేదా రెండు వేల బిల్లులు అవడం  చాలా అరుదు. రోజూ వాడుకోవడానికి అవసరమైన బాడీలోషన్, మాయిశ్చరైజర్, సన్ క్రీమ్, సబ్బు, పౌడర్ ఇంకా  కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులను కొంటె బిల్లు మూడు, నాలుగు వేలు అవుతుంటుంది. ఇప్పుడు పిల్లల కోసం చాలా ఉత్పత్తులు  మార్కెట్లోకి కూడా ప్రవేశించాయి. బేబీ సోప్, బాడీ వాష్, హెయిర్ వాష్, పౌడర్, బాడీ మసాజ్ ఆయిల్ ఇలా రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం, చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టే తల్లిదండ్రులు ఒకోసారి ఖర్చు  ఎక్కువైనా కొంటుంటారు. 

పిల్లల ఉత్పత్తులలో కెమికల్స్  ఉపయోగించకూడదనే థీమ్‌తో కంపెనీలు ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసి విక్రయిస్తాయి. అందుకే వీటి ధర ఒకటికి రెట్టింపు ఉంటుంది. పిల్లల ఉత్పత్తుల తయారీ సంస్థ ఇప్పుడు వాటి  ఉత్పత్తులు, ధరలతో వార్తల్లో నిలిచింది. అదేంటంటే  పిల్లల కోసం సువాసనగల నీటిని తయారు చేసింది, అయితే దీని అధిక ధరపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

బేబీ కేర్ అండ్  స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ డియోర్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ లగ్జరీ బ్రాండ్ పిల్లల కోసం సువాసనగల నీటిని విడుదల చేసింది. దీని ధర దాదాపు 19 వేల రూపాయలు. ఈ eau de పర్ఫమ్ డియోర్స్ బేబీ సెంట్ సిరీస్  ఉత్పత్తి. దీనిని  బోన్ ఎటోయిల్ లేదా లక్కీ స్టార్‌గా విక్రయించబడింది. ఈ ఉత్పత్తి ఆల్కహాల్ లేనిదని కంపెనీ పేర్కొంది. అయితే దీని కోసం పండ్ల రసాన్ని ఉపయోగిస్తారు. 

డియోర్ ఒక ఫ్రెంచ్ కంపెనీ  లగ్జరీ బ్రాండ్ . దీని యజమాని ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్. బెర్నార్డ్ మరొక ప్రసిద్ధ ఫ్రెంచ్ కంపెనీ LVMH కి అధిపతి. ఈ డియోర్ కంపెనీ ఖరీదైన లగ్జరీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పిల్లల కోసం, ఈ ఫ్యాషన్ బ్రాండ్ రూ. 7902 విలువైన క్లిన్సింగ్ వాటర్, రూ. 7900 విలువైన ఫేస్ వాష్, రూ. 9,500 విలువైన బాడీ లోషన్ ఇతర ఖరీదైన బాడీ అండ్  హెయిర్ ఫోమ్ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది.  

సోషల్ మీడియాలో విమర్శలు: ప్రస్తుతం చిన్నారుల కోసం రూ.19 వేల విలువైన సువాసనగల నీటిని లాంచ్ చేయడం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలు కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ సువాసనగల నీటితో బేబి ఎం చేసుకుంటాడు అని  ఒక యూజర్  అడగగా, దీని ధర ఆశ్చర్యకరంగా ఉందని మరొకరు కామెంట్ పోస్ట్ చేసారు. పెర్ఫ్యూమ్ వాటర్ ఎక్కువ ధర పెట్టి కొనే బదులు బేబిని ఇంట్లోనే అలా వదిలేయడం మంచిదని మరొకరు ఇంకా మరో వ్యక్తి $230 విలువైన నీళ్లలో వజ్రాలు ఉంటే బాగుంటుందని పోస్ట్ రాశాడు. ఈ నీటికి 230 డాలర్లు చెల్లించడం పిచ్చి అని ఓ వ్యక్తి అనగా , మరొకరు పిల్లలకు ఖరీదైన ప్రొడక్ట్స్  ఇచ్చి రసాయనాలు ఎందుకు వేయాలని మరొకరు ప్రశ్నించారు. 

click me!