నేటి నుంచే! ఈ బ్యాంక్ ఖాతాదారులకు చెల్లించే వడ్డీరేటు తగ్గింపు

By rajashekhar garrepallyFirst Published May 2, 2019, 10:50 AM IST
Highlights

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తన పొదుపు ఖాతాల(సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును తగ్గించింది. రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు గురువారం(మే 2) నుంచి తగ్గించిన వడ్డీ రేటు పొందాల్సి ఉంటుంది. 

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తన పొదుపు ఖాతాల(సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును తగ్గించింది. రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు గురువారం(మే 01) నుంచి తగ్గించిన వడ్డీ రేటు పొందాల్సి ఉంటుంది. 

రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగివున్న ఖాతాదారులు 3.25శాతం వడ్డీరేటును మాత్రమే పొందగలరు. ఇక రూ. లక్ష కంటే తక్కువ  మొత్తం బ్యాలెన్స్ కలిగివున్న ఖాతాదారులు 3.50 వడ్డీరేటును పొందుతారు.

భారత రిజర్వు బ్యాంక్ రెపో రేటు ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్యకు ఉపక్రమించింది. ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేటు  6శాతానికంటే ప్రస్తుతం ఎస్బీఐ 2.75శాత వడ్డీరేటు తక్కువగానే ఇస్తోంది. 

కాగా, రెండు నెలలకోసారి జరిగే రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాన్ని బట్టి స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఎస్బీఐ ఇంతకుముందు రూ. లక్ష సేవింగ్స్ డిపాజిట్ వరకు కూడా 3.5శాతం వడ్డీరేటు ఇచ్చింది. రూ. కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్లపై 4శాతం వడ్డీరేటు చెల్లిస్తోంది. 

click me!