క్యాష్ విత్ డ్రాపై ఎస్‌బి‌ఐ కొత్త రూల్...జనవరి 1 అమలు...

By Sandra Ashok Kumar  |  First Published Dec 27, 2019, 5:45 PM IST

డబ్బులు విత్ డ్రా చేసుకునేటప్పుడు, మీరు బ్యాంకులో మీ అక్కౌంట్ సంభందించి లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌పై ఓ‌టి‌పి (OTP) అందుకుంటారు. అందువల్ల, ఎటిఎమ్ నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీతో పాటు ఉండేలా చూసుకోండి.


బ్యాంక్ ఏ‌టి‌ఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసుకునేటప్పుడు, మీరు బ్యాంకులో మీ అక్కౌంట్ సంభందించి లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌పై ఓ‌టి‌పి (OTP) అందుకుంటారు. అందువల్ల, ఎటిఎమ్ నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీతో పాటు ఉండేలా చూసుకోండి. ఎటిఎం సంబంధిత మోసాలు పెరగడంతో, బ్యాంకులు తమ కస్టమర్లను సైబర్ నేరగాళ్ల నుండి రక్షించదడానికి ఈ కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నాయి.

also read  స్టాక్ మార్కెట్ల రికార్డు....ఐదేళ్లలో తొలిసారి....

Latest Videos

undefined

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) డిసెంబర్ 26 తేదీన ఒక ట్వీట్ ద్వారా ఎటిఎంల కోసం వన్ టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) ఆధారిత నగదు విత్ డ్రా వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని తెలిపింది. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ .10వేలు, ఆపైన చేసే విత్ డ్రాలకు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ట్వీట్ ద్వారా తెలిపిన సమాచార ప్రకారం, ఈ సౌకర్యం 1 జనవరి 2020 నుండి అన్ని ఎస్‌బి‌ఐ ఎటిఎంలలో వర్తిస్తుంది.


ఎటిఎమ్ వద్ద నగదు విత్ డ్రా చేసే సమయంలో ఎస్‌బి‌ఐ కార్డుదారులు ఎస్‌బి‌ఐ బ్యాంకు అక్కౌంట్ లింక్ చేసిన వారి మొబైల్ నంబర్ కు ఓటిపిని అందుకుంటారు అని బ్యాంక్ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలోని ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. "OTP అనేది డబ్బులు విత్ డ్రా  కోసం వినియోగదారుని ఒక సంఖ్యా స్ట్రింగ్ పిన్ నెంబర్ వస్తుంది. ఇది ఎస్‌బి‌ఐ కార్డ్ హోల్డర్ల అనధికార నగదు విత్ డ్రాల నుండి రక్షిస్తుంది" అని ఎస్‌బి‌ఐ తెలిపింది.


నగదు ఉపసంహరణ సమయంలో ఎస్బిఐ కార్డ్ హోల్డర్  ఎంత మొత్తం డబ్బులు కావాలో ఎంటర్ చేసిన తర్వాత, ఎటిఎం స్క్రీన్ పైన OTP చూపిస్తుంది. ఎస్బిఐ కార్డ్ హోల్డర్ నగదును విత్ డ్రా  ముందు స్క్రీన్ పైన బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయాలి. "ఇది స్కిమ్డ్ / క్లోన్ కార్డుల కారణంగా అనధికార లావాదేవీల నుండి వినియోగదారులను కాపాడుతుంది" అని బ్యాంక్ ఫేస్ బుక్  పోస్ట్ పేర్కొంది.

also read  రిలయన్స్ రిటైల్ వాల్యూ ఎంతో తెలుసా....అక్షరాల....

ఎస్‌బి‌ఐ ఓ‌టి‌పి- ఆధారిత నగదు విత్ డ్రా వ్యవస్థ గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలు

1.ఈ సేవలు 1 జనవరి 2020 నుండి రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు అన్ని ఎస్బిఐ ఎటిఎంలలో ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.

2.మీరు రూ .10వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదును విత్ డ్రా చేసుకునే ముందు మాత్రమే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ కి OTP వస్తుంది.

3.ఎస్బిఐ ఎటిఎంల నుండి నగదును విత్ డ్రా సంభందించి పెద్ద మార్పులు లేవు.

4.ఒక ఎస్బిఐ కార్డ్ హోల్డర్ మరొక బ్యాంకు ఎటిఎం నుండి నగదు విత్ డ్రా చేస్తే ఈ సౌకర్యం వర్తించదు. 
 

click me!