ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? అయితే ఇది తెలుసుకోండి.

By Sandra Ashok Kumar  |  First Published Nov 1, 2019, 1:17 PM IST

డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించిన ఎస్‌బీఐ. ప్రస్తుత నిధుల లభ్యత (లిక్విడిటీ)ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఈ తగ్గింపు శుక్రవారం నుంచే  అమల్లోకి వస్తుంది అని తెలిపారు. 


న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వడ్డీ రేట్లపై కొత్త నిర్ణయం తీసుకుంది.  ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటును మరింత తగ్గించింది. ఎస్‌బీఐ ఖాతాల్లో రూ.లక్ష వరకు ఉండే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గింది. శుక్రవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది.

also read పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్

Latest Videos

ప్రస్తుత నిధుల లభ్యత (లిక్విడిటీ)ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఖాతాల్లో రూ.1 లక్షకు మించి ఉండే ఎస్‌బీ డిపాజిట్లపై చెల్లించే మూడు శాతం వడ్డీ రేటులో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఈ సంవత్సరం మే నుంచి ఎస్‌బీఐ తన డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ రెపో రేట్లతో ముడిపెట్టింది. అక్టోబరు మొదటి వారంలో జరిగిన ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును 5.40 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గించింది. దీంతో ఎస్‌బీఐ రూ.1 లక్ష కంటే తక్కువ ఉండే డిపాజిట్లకు ఈ తగ్గింపును వర్తింపజేస్తుంది అని తెలిపారు.

also read బంధన్ బ్యాంకుపై జరిమాన విధించిన ఆర్‌బిఐ !
 
ఇక అలహాబాద్‌ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. బయటి వడ్డీ రేట్లు ప్రామాణికంగా ఉండే (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌) అన్ని ఉత్పత్తు(రుణాలు, డిపాజిట్లు)లపై వడ్డీ రేటు 0.35 శాతం తగ్గిస్తున్నట్టు అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ తగ్గింపు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తోందని తెలిపారు. 

click me!