భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించింది. వడ్డీరేటు (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నూతన గృహ కొనుగోలుదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ తీపి కబురు అందించింది. ఎస్బీఐ తన 'ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడు ఉన్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగి రానున్నది.
also read ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...నూతన ఇయర్ కానుకగా...
undefined
ఈ కొత్త రేటు 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈబీఆర్ తగ్గింపుతో గృహ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు లాభం చేకూరనుంది.ఎస్బీఐ 2019 జులై 1 నుంచి ఈ ఫ్లోటింగ్ రేటు గృహరుణాలు మంజూరు చేస్తోంది. ఈబీఆర్ తగ్గింపుతో ఇప్పుడున్న 8.15 శాతం వడ్డీరేటు నూతన సంవత్సరంలో 7.90 శాతానికి దిగిరానుంది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అన్ని బ్యాంకులను ఒక నిర్దిష్ట వర్గాల రుణాలను ఈబీఆర్కు అనుసంధానించాలని ఆదేశించింది. 'రెపోరేటు' తగ్గింపుపై బ్యాంకులు తాత్సారం చేయడమే ఇందుకు కారణం.ఆర్బీఐ ఆదేశాల తరువాత ఎస్బీఐ తన ఈబీఆర్గా 'రెపోరేటు'ను స్వీకరించింది. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దీనిని ఆధారంగా చేసుకునే గృహ, ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణాలు అందిస్తోంది.
also read బ్యాంకులకు వెళుతున్నారా అయితే ఈ వివరాలు తెలుసుకోండి...
ఆర్బీఐ ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. అయితే బ్యాంకులకు తమ ఈబీఆర్ను మూడు నెలలకోసారి మార్చుకునేందుకు అవకాశమూ ఉంది. అయినా బ్యాంకులు ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాలపై వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేటు (డబ్ల్యూఏఎల్ఆర్) 44 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గడం గమనార్హం.