కోత పెడితే రోడ్డున పడతా.. వేతన కోతపై ఎస్బీఐ చైర్మన్ సరదా వ్యాఖ్య

By narsimha lodeFirst Published Jun 7, 2020, 1:58 PM IST
Highlights

కరోనా సంక్షోభంతో కుదేలైన అనేక సంస్థలు ప్రస్తుతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల వేతనాలను కుదిస్తున్నాయి. ఇదేవిధంగా తన వేతనాన్ని కుదిస్తే రోడ్డుపై బతకాల్సి వస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ సరదాగా వ్యాఖ్యానించారు. 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలైన అనేక సంస్థలు ప్రస్తుతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల వేతనాలను కుదిస్తున్నాయి. ఇదేవిధంగా తన వేతనాన్ని కుదిస్తే రోడ్డుపై బతకాల్సి వస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ సరదాగా వ్యాఖ్యానించారు. 

శుక్రవారం విశ్లేషకులతో జరిగిన ఓ చర్చాగోష్టిలో ‘సార్‌‌..ప్రైవేటు బ్యాంకుల్లో సాలరీలు కట్‌‌చేస్తున్నరు కదా.. మీ స్టేట్‌‌బ్యాంకులో కూడా కటింగ్స్‌‌ఉంటాయా ?’’ అని అడిగినప్పుడు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే నా జీతం చాలా తక్కువయ్యా! ఇంకా తగ్గించుకున్నాననుకో… రోడ్డు మీద పడతా!’’ అని జవాబిచ్చారు. ఇవి సరదాగా చేసిన వ్యాఖ్యలైనా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల ఉన్నతాధికారులకు మధ్య వేతనాల్లో ఉన్న భారీ తేడాను ఎత్తి చూపుతున్నాయి. 

ఒకేఒక చిన్న తేడా ఏమిటంటే ప్రభుత్వ బ్యాంక్‌‌ టాప్‌‌ఎగ్జిక్యూటివ్‌‌లు ఖరీదైన లోకేషన్లలో బంగ్లాలు వంటి చాలా బెనిఫిట్స్‌‌ను పొందుతుంటారు. కానీ ప్రైవేటు వాళ్లతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు.

ప్రపంచంలోని టాప్‌-50 బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ అధిపతిగా రజనీష్‌ కుమార్‌ ప్రస్తుతం రూ.30 లక్షల కోట్లకు పైగా బ్యాంకు ఆస్తులను, 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగులను మేనేజ్‌ చేస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29,53,750 వార్షిక వేతనాన్ని పొందినట్టు ఎస్బీఐ వెల్లడించింది. అంటే నెలకు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు కూడా ఉండదు. 

also read:ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్

కానీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఎస్బీఐ ఆస్తుల్లో కనీసం మూడో వంతుకూడా లేవు. అయినప్పటికీ 2019 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో రూ.55 కోట్లకుపైగా వార్షిక వేతనాన్ని పొందడం గమనార్హం. నెలకు నాలుగున్నర కోట్ల రూపాయలపైనే జీతం తీసుకుంటున్నారన్న మాట.

అలాగని ఎస్బీఐ ఏమన్నా బీద బ్యాంకేమీ కాదు. ఎస్బీఐ ఆస్తులతో పోల్చుకుంటే హెచ్డీఎఫ్సీ ఆస్తులు అందులో మూడోవంతు కూడా ఉండవు.  అయినా వీటి టాప్‌‌ఎగ్జిక్యూటివ్‌‌ల జీతాల మధ్య తేడా ఎంతుందో చూస్తే ఆశ్చర్యమే కదా! కరోనా వల్ల ఇప్పటికే యెస్‌‌బ్యాంక్‌‌, ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌‌బ్యాంక్‌‌, కోటక్‌‌ మహింద్రా బ్యాంక్‌‌ తమ సీనియర్ మేనేజ్‌‌మెంట్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ల జీతాలలో 10–30 శాతం కోతను ప్రకటించాయి. 
 

click me!