రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బిఐ గుడ్ న్యూస్...

By Sandra Ashok KumarFirst Published Jul 25, 2020, 10:49 AM IST
Highlights

వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్‌బి‌ఐ సర్కిల్‌ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది. 

హైదరాబాద్‌: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) లో రిటైర్డ్ ఉద్యోగి అయితే మీకో శుభవార్త . ప్రత్యేకంగా మాజీ ఉద్యోగుల కోసం బ్యాంక్ మళ్ళీ తలుపులు తెరిచింది. వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్‌బి‌ఐ సర్కిల్‌ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది. కొన్ని నెలల క్రితం ఎస్‌బిఐ ఢీల్లీ సర్కిల్‌లో రిటైర్డ్ ఉద్యోగులను నియమించే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు అదే తరహాను హైదరాబాద్, అమరావతి, పాట్నా, ముంబై మెట్రో, మహారాష్ట్రలోని ఎస్‌బిఐ సర్కిల్‌లలో నియామకాలు చేపట్టింది.

స్కేల్ I నుండి స్కేల్ V అధికారులుగా పనిచేసి, 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసిన దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్వచ్ఛంద పదవీ విరమణ ఎంచుకున్న లేదా సర్వీస్ నుండి తొలగించిన వారికి అర్హత లేదు.

అందుబాటులో ఉన్న స్థానాలు సర్కిల్ నుండి సర్కిల్‌కు మారుతూ ఉంటాయి. డిజిటల్ లావాదేవీల బ్యాంకింగ్, ఎఫ్‌ఐ‌ఎం‌ఎం  నెట్‌వర్క్, ఎనీ టైమ్ బ్యాంకింగ్, బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్స్, ఛానల్ మేనేజర్స్ / సూపర్‌వైజర్ పోస్టులు ఉంటాయి.

also read 60 మంది ఎయిర్ ఇండియా పైలెట్లకు సోకిన కరోనా.. ...

నెల వేతనం
నెల వేతనం 30,000-40,000 లో ఇవ్వబడుతుంది. నియామకం ఒక సంవత్సరం కాలానికి ఉంటుంది, కాని తాజా నోటిఫికేషన్ ప్రకారం మరో సంవత్సరం పొడిగించవచ్చు. ఖాళీ పోస్టుల గురించి ఎస్‌బి‌ఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఎస్‌బి‌ఐ సర్కిల్స్ స్థానిక అవసరాలకు అనుగుణంగా నియామకాలు ఉన్నందున  ఎంత మండి నియామకం చేసుకుంటాం అనేది చెప్పలేం.

అయితే కొన్ని బ్యాంకు వర్గాల ప్రకారం 500 మందికి పైగా నియమించుకోవచ్చు. మాజీ ఎస్‌బి‌ఐ ఉద్యోగులు తగినంత దరఖాస్తుదారులు లేకపోతే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల రిటైర్డ్ ఉద్యోగులు పరిగణించనున్నారు. ప్రతి సంవత్సరం బ్యాంకింగ్ సిబ్బంది నియమకాల్లో (క్లర్కులు, ప్రొబేషనరీ ఆఫీసర్లు) ఎస్‌బి‌ఐ అతిపెద్ద రిక్రూటర్ కానీ రిటైర్డ్ సిబ్బందిని నియమించుకోవడం వల్ల సాధారణ నియామకాలను కొంతవరకు ప్రభావితం చేస్తుంది.
 

click me!