'ఇండియా ప్రపంచ దేశాల నమ్మకాన్ని సంపాదించింది'

By Sandra Ashok KumarFirst Published Jul 24, 2020, 3:59 PM IST
Highlights

చైనాతో వ్యాపార అనుబంధం ఉన్న అన్నీ దేశాలను  ఆకర్షించగలదని, చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించగలదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ బుధవారం అన్నారు.

వాషింగ్టన్: అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నమ్మకాన్ని భారత్ సంపాదించింది. చైనాతో వ్యాపార అనుబంధం ఉన్న అన్నీ దేశాలను  ఆకర్షించగలదని, చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించగలదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ బుధవారం అన్నారు.

యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) వార్షిక "ఇండియా ఐడియాస్ సమ్మిట్" వర్చువల్ మీటింగ్ ప్రసంగంలో యుఎస్, భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం అని పోంపీయో అన్నారు.

అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ మరింత సానుకూల వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు. చైనా గ్లోబల్ సప్లయ్ చైన్ ఆకర్షించడానికి టెలికమ్యూనికేషన్స్, వైద్య సామాగ్రి, ఇతర రంగాలలో చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశానికి అవకాశంగా ఉందని పోంపీయో తెలిపింది.

also read క‌రోనా వైరస్ మహమ్మారికి నాకు సంబంధం లేదు : బిల్ గేట్స్‌ ...

"భారతదేశం ఈ స్థానంలో ఉంది అంటే కారణం అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నమ్మకాన్ని సంపాదించింది" అని ఆయన అన్నారు. మా భాగస్వామ్యం మరింత బలపడుతుందనే నమ్మకం ఉంది.

అమెరికా ఆతిథ్యం ఇవ్వబోయే జి -7 సమ్మిట్ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు. టిక్‌టాక్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించాలన్న భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాంపియో తన ప్రసంగంలో ప్రశంసించారు.

భారత్‌తో సంబంధం కొత్త యుగం కావాలని అమెరికా కోరుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశం కొన్ని విశ్వసనీయమైన  దేశాలలో ఒకటి, చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన  కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేటు రంగం కుదేలైన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

click me!