బ్యాంక్ కస్టమర్లకు గమనిక : మరికొద్ది గంటల్లో నిలిచిపోనున్న ఎస్‌బి‌ఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ సర్వీసులు..

By S Ashok KumarFirst Published May 7, 2021, 4:15 PM IST
Highlights

ఈ రోజు రాత్రి నుండి దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్‌బి‌ఐ బ్యాంక్ అలాగే ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డి‌ఎఫ్‌సి సేవలు నిలిచిపోనున్నాయి. నిర్వహణ సంబంధిత పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని ఒక ట్వీట్ ద్వారా తెలిపింది.

మీరు ఏదైనా బ్యాంకు  సంబంధించిన పనిని డిజిటల్ మార్గంలో చేయవలసి వస్తే దాన్ని వెంటనే పూర్తి చేయండి. ఎందుకంటే ఈ రోజు రాత్రి  నుండి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అలాగే ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్  కొన్ని సేవలు  నిలిచిపోనున్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్లకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఈ రెండు బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) వంటి సదుపాయాన్ని వినియోగదారులు ఉపయోగించలేరు. నిర్వహణ పనుల కారణంగా  ఈ  అంతరయం ఏర్పడనుంది.

గత నెలలో కూడా నిర్వహణ సంబంధిత పనుల కారణంగా ఎస్‌బి‌ఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ప్రభావితమైయ్యాయి. 

ఎస్‌బిఐ  ట్వీట్ ద్వారా  సమాచారం 
7 మే 2021 రాత్రి 10.15 నుండి 8 మే 2021న 1.45 వరకు నిర్వహణ సంబంధిత పనులు జరుగుతాయని ఎస్‌బిఐ ఒక ట్వీట్‌ ద్వారా పేర్కొంది. ఈ సమయంలో INB, YONO, YONO Lite, UPI సేవలు అందుబాటులో ఉండవు. కస్టమర్లకు ఏర్పడనున్న అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము, అలాగే ఇందుకు సహకరించగలరని కోరింది.

also read 

 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హెచ్చరిక
హెచ్‌డిఎఫ్‌సి కూడా కస్టమర్లకు ఒక హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుండి నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది అని బ్యాంక్ తెలిపింది. కొన్ని షెడ్యూల్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా మే 8న ఉదయం 8 నుండి  సాయంత్రం 5 గంటల వరకు నెట్‌బ్యాంకింగ్ అలాగే మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు అని బ్యాంక్ ఇ-మెయిల్ ద్వారా పేర్కొంది.

ఇండియాలో ఎస్‌బిఐ బ్యాంక్  శాఖలు 

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐకి 22వేలకి పైగా శాఖలు, 57,889 ఎటిఎంలు ఉన్నాయి. 31 డిసెంబర్ 2020 నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య  8.5 కోట్లు, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య 1.9 కోట్లు. బ్యాంక్ యుపిఐని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 135 మిలియన్లు.

 

We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.
pic.twitter.com/JogglXemol

— State Bank of India (@TheOfficialSBI)
click me!