
Sangeetha 52nd Anniversary Sale: భారతదేశపు ప్రముఖ ఓమ్నీ-ఛానల్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ రిటైల్ చైన్ అయిన సంగీత మే 31 నుండి తన అద్భుతమైన 52వ వార్షికోత్సవ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని తన “అత్యంత భారీ, అత్యధిక ప్రయోజనకరమైన సేల్” అని సంగీత పేర్కొంది.
ప్రతి సంగీత స్టోర్‌కలిగిన నగరంలో నెల రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ వార్షికోత్సవ వేడుక, అపూర్వమైన కస్టమర్ ఆఫర్లు, ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఉత్సాహభరితమైన బహుమతులు, సులభమైన ఫైనాన్స్ ఎంపికలను అందిస్తోంది. ఇది దేశంలోనే ఎక్కువమంది వినియోగదారులను దృష్టిలో పెట్టుకున్న రిటైల్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా నిలుస్తుంది.
ఈ వేడుకలో భాగంగా కేవలం సంగీత స్టోర్‌లోకి అడుగుపెట్టి కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కొనుగోళ్లపై అంతకంటే పెద్ద రివార్డ్‌లు, అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సంగీత వార్షికోత్సవ క్యాంపెయిన్ కేవలం డిస్కౌంట్‌లకు పరిమితం కాకుండా, సాటిలేని రక్షణ, సర్వీస్ ప్రయోజనాల ద్వారా కస్టమర్‌లకు పూర్తి మానసిక ప్రశాంతతను అందించేలా రూపొందించబడింది.
ఈ లాంచ్ గురించి సంగీత మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ:..“52 ఏళ్లుగా, కస్టమర్లు సంగీతను కేవలం ఉత్తమ ఉత్పత్తులు, ధరల కోసమే కాకుండా, ప్రతి కొనుగోలుతో వచ్చే నమ్మకం, సేవా అనుభవం కోసం విశ్వసించారు. ఈ వార్షికోత్సవ వేడుక కస్టమర్‌లకు సాధ్యమైనంత పెద్దగా తిరిగి కృతజ్ఞత తెలుపుకునే మార్గం. మునుపెన్నడూ లేని ప్రొటెక్షన్ ప్రయోజనాల నుండి రివార్డ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డోర్‌స్టెప్ సర్వీస్, అద్భుతమైన బహుమతుల వరకు, ప్రతి ఇంటికి నిజంగా సాటిలేని విలువను అందించే వార్షికోత్సవ ఫెస్టివల్‌ను మేము రూపొందించాలనుకున్నాము.” అన్నారు.
“నేటి కాలంలో టెక్నాలజీ అనేది చాలా వ్యక్తిగతమైనది, దైనందిన జీవితానికి అవసరమైనది. మా ఉద్దేశ్యం కేవలం పరికరాలను విక్రయించడం మాత్రమే కాదు, కస్టమర్లు తమ కొనుగోలు తర్వాత కూడా సురక్షితంగా, సపోర్టుగా, రివార్డ్‌లను పొందుతున్నట్లు భావించేలా చేయడం. ఈ వార్షికోత్సవ వేడుక కచ్చితంగా ఆ ఫిలాసఫీని ప్రతిబింబిస్తుంది.”
దక్షిణ భారతదేశం అంతటా బలమైన ఉనికిని, దశాబ్దాల కస్టమర్ విశ్వాసాన్ని కలిగి ఉన్న సంగీత కస్టమర్-ఫస్ట్ ఇన్నోవేషన్, అత్యుత్తమ సేవలు, సాటిలేని విలువైన ఆఫర్లు అందిస్తోంది. ఇది భారతదేశపు అత్యంత ప్రియమైన ఎలక్ట్రానిక్స్, మొబైల్ రిటైల్ గమ్యస్థానాలలో ఒకటిగా తన స్థానాన్ని బలోపేతం చేస్తూనే ఉంది. 52వ వార్షికోత్సవ సేల్ మే 31న ప్రారంభమవుతుంది. అన్ని సంగీత స్టోర్‌లలో పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది.
ఐదు దశాబ్దాల క్రితం స్థాపించబడిన సంగీత బహుళ నగరాల్లో బలమైన ఓమ్నీ-ఛానల్ ఉనికిని కలిగి ఉన్న భారతదేశపు ప్రముఖ మొబైల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్‌లలో ఒకటి. కస్టమర్-ఫస్ట్ విధానం, విశ్వసనీయ సేవ, వినూత్న రిటైల్ అనుభవాలకు పేరుగాంచిన సంగీత, ప్రముఖ గ్లోబల్ బ్రాండ్‌ల నుండి మొబైల్స్, గ్యాడ్జెట్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ ఆండ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను అందిస్తోంది.