The CMO Assembly: నేటి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు విపరీతమైన ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు?

Published : May 27, 2026, 06:21 PM IST
Vivek Sheth founder of The CMO Assembly explains why todays Chief Marketing Officers are under pressure

సారాంశం

The CMO Assembly: ది సీఎంవో అసెంబ్లీ.. ఇది చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు, సీనియర్ మార్కెటింగ్ నిపుణులతో నడుస్తున్న ఒక ప్రత్యేక ప్లాట్ ఫారం. దీనికి వ్యవస్థాపకుడు వివేక్ షేత్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎంవోలు ఈ కాలంలో ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నారో వివరించారు. 

ప్రతి బ్రాండ్ కు ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు, సీనియర్ మార్కెటింగ్ నిపుణులు ఉంటారు. వారందరి కోసమే ది సీఎంవో అసెంబ్లీ అనే సంస్థను స్థాపించారు వివేక్ షేత్. ఈ సంస్థ ఇటీవల ది ఇండియా సీఎంఓ ఇండెక్స్ 2026 ను విడుదల చేసింది. ఇందులో 11 పరిశ్రమలకు చెందిన 121 మంది మార్కెటింగ్ నాయకుల నుండి అభిప్రాయాలను, డేటాను సేకరించింది. దీనిపై వ్యవస్థాపకుడు వివేక్ షేత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: భారతదేశ మార్కెటింగ్ వ్యవస్థలో మీరు గమనించిన ఏ లోపం వల్ల ‘ది సీఎంఓ అసెంబ్లీ’ని ప్రారంభించారు?

జవాబు: మనదేశంలో సీఎంవోల కోసం నిజాయితీతో కూడిన ఫ్లాట్ ఫారం లేవనిపించింది. సమావేశాలు, అవార్డులు, నెట్వర్కింగ్ గ్రూపులు పుష్కలంగా ఉన్నాయి. కానీ సీఎంవోల కోసం నిజంగా మాట్లాడగలిగే ప్రదేశం ఏదీ లేదు. నిజానికి నేటి సీఎంవోలు బోర్డుల నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అలాగే ఏఐ విప్లవం, పని తీరుపై అంచనాలు, అంతర్గత రాజకీయాలు.. ఇవన్నీ సీఎమ్ఓలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. కానీ వారు తమ తోటి వారితో ఈ విషయాలను నిజాయితీగా చర్చించుకోగలిగే వాతావరణ ఎక్కడా లేదు. దానికి పరిష్కారంగానే ది సీఎంవో అసెంబ్లీని నేను నిర్మించాను. ఇదొక ఇండస్ట్రీ ప్లాట్ ఫారం కాదు. ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తుల మధ్య నిజమైన సంభాషణ కోసం ఏర్పడిన ఒక ప్రదేశం.

ప్రశ్న: ఈ ప్లాట్ ఫారం పెట్టాలన్న ఆలోచన రావడానికి అసలైన కారణం లేదా సందర్భం ఏదైనా ఉందా?

జవాబు: ఇండస్ట్రీ ఈవెంట్ల తర్వాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లతో కాసేపు మాట్లాడటం వంటివి జరగడం నాకు గుర్తుంది. కాఫీ తాగుతూ, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాము. స్టేజ్ పై చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడే వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుతున్నప్పుడు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, బోర్డు అంచనాలతో ఇబ్బంది పడుతున్నామని ఏఐ ఈ పరిశ్రమను ఎక్కడికి తీసుకు వెళుతుందో అయోమయంలో ఉన్నామని చెబుతుండేవారు. భారతదేశంలో అత్యంత విలువైన మార్కెటింగ్ మాటలు.. ఇలా అనధికారికంగా, రహస్యంగా జరగడం నేను గమనించాను. వారు మాట్లాడేందుకు కూడా ఒక సరైన ప్లాట్ ఫారం అవసరమనే ఆలోచన వచ్చింది. అలా ఈ సీఎంవో అసెంబ్లీ పుట్టింది.

ప్రశ్న: ఈరోజు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లుగా ఉన్నవారు ప్రైవేటుగా బాధపడుతున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి?

జవాబు: చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు పదేపదే మూడు విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు. మొదటిది ఈ ఏఐ ఆధారిత ప్రపంచంలో సాంప్రదాయ బ్రాండ్ నిర్మాణ పద్ధతులు పనిచేస్తాయా లేదా అనేది వారి ఆలోచన. ఇక రెండోది ఖర్చు చేసిన ప్రతి రూపాయిని సమర్థించుకోవడానికి విపరీతమైన ఒత్తిడి పడుతున్నారు. ఇక మూడవది గుర్తింపు. భవిష్యత్తులో మార్కెటింగ్ బృందాలు అసలు ఎలా ఉండాలనే దాని గురించి విపరీతంగా ఆలోచించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీరిని ప్రభావితం చేస్తోంది. వీటిన్నింటి మధ్య సీఎంవోలు నలిగిపోతున్నారు.

ప్రశ్న: రహస్య సమావేశాలలో మార్కెటింగ్ నిపుణులు ఒప్పుకుంటున్న ఒక ఇబ్బందికరమైన నిజం ఏమిటి?

జవాబు: మార్కెటింగ్ భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. సంవత్సరాలుగా ఈ పరిశ్రమ ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యం ఇచ్చింది. కానీ రహస్యంగా సీఎంవోలు మాట్లాడుతున్నప్పుడు పాత వ్యూహాలపై నమ్మకం లేదని చెబుతున్నారు. వినియోగదారుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉందో చెప్పలేకపోతున్నామని, బ్రాండ్లు పట్ల నమ్మకం బలహీనపడుతోందని చెబుతున్నారు. కేవలం మార్కెటింగ్ మాత్రమే శాశ్వతమైన బ్రాండ్లను నిర్మించలేదు.. అత్యంత అనుభవం ఉన్న మార్కెటింగ్ నిపుణులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న పరిస్థితి వచ్చింది.

ప్రశ్న: ది సీఎంవో అసెంబ్లీ ప్రారంభించినప్పటి నుంచి మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటి?

జవాబు: చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు నిజాయితీగా ఉండడం కోసం ఎంతగా తహతహలాడుతున్నారో నేను గమనించాను. వారు భావోద్వేగ పరంగా ఇంత బహిరంగంగా ఉంటారని ఈ సంస్థ పెట్టాకే నాకు అర్థమైంది. చాలామంది సీఎంఓలు ఒత్తిడిని చాలా దాచుకుంటున్నారు, బయట నుండి చూస్తే మార్కెటింగ్ నాయకత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.. కానీ అంతర్గతంగా అది ఒంటరితనాన్నే ఇస్తుంది. అంతా తమ అదుపులోనే ఉంది అనే చిత్రాన్ని మాత్రమే బయటికి చూపించాలి. అది చేయడం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లకు చాలా కష్టంగా ఉండే విషయం.

ప్రశ్న: భారతదేశంలోని ప్రతి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ని అత్యంత నిజాయితీతో కూడిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమని మీరు అడగాలనుకుంటే ఆ ప్రశ్న ఏమవుతుంది?

జవాబు: మిమ్మల్ని ఎవరూ గమనించకపోతే రేపు మీరు మార్కెటింగ్ లో ఏ పనులు చేయడం మానేస్తారు అని అడుగుతాను. ఈ ప్రశ్న అడగడం వల్ల ప్రతి విషయం బయటపడుతుంది. కొలమానాలు, కేవలం షో కోసమే నడిపే ప్రచారాలు, ఎందుకు పనికిరాని సమావేశాలు, ఎవరూ చదవని రిపోర్టులు, అందరూ చూస్తున్నారు కదా అని తాము కూడా చేసే కొన్ని పారిశ్రామిక పనులు.. అన్నీ ఈ ఒక్క ప్రశ్నతో బయటకు వస్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?
Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా