సహారా పరివార్‌ గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌పై సెబీ ఫైర్‌.. బకాయిలు చెల్లించకుంటే బెయిల్‌ రద్దు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 20, 2020, 04:11 PM IST
సహారా పరివార్‌ గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌పై సెబీ ఫైర్‌.. బకాయిలు చెల్లించకుంటే బెయిల్‌ రద్దు..

సారాంశం

సుబ్రతా రాయ్ కి చెందిన రెండు కంపెనీలు రూ. 62,600 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించినట్టు రెగ్యులేటరీ బాడీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. ఒకవేళ చెల్లించకపోతే అతని బెయిల్‌ను రద్దు చేయలని కోరింది. 

సహారా గ్రూప్ యజమాని సుబ్రతా రాయ్ కి కష్టాలు పెరిగాయి. సుబ్రతా రాయ్ కి చెందిన రెండు కంపెనీలు రూ. 62,600 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించినట్టు రెగ్యులేటరీ బాడీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది.

ఒకవేళ చెల్లించకపోతే అతని బెయిల్‌ను రద్దు చేయలని కోరింది. సెబీ సుప్రీం కోర్టులో ఇచ్చిన పిటిషన్ ద్వారా ఈ విషయన్ని తెలిపింది. రెగ్యులేటరీ బాడీ ప్రకారం సహారా ఇండియా పరివర్ గ్రూప్ రెండు కంపెనీలు, గ్రూప్ హెడ్ సుబ్రతా రాయ్ రూ .62 వేల 600 కోట్లు బాకీ పడ్డారు.

వీటిని ఎనిమిదేళ్ల క్రితం తిరిగి చెల్లించాలని ఆదేశించారు. సహారా గ్రూప్ 2012, 2015లో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని సెబీ తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించవలసిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియజేసింది.

also read 48 రోజుల తర్వాత వాహనదారులపై మళ్ళీ పెట్రోల్ ధరల సెగ.. నేడు లీటరు పెట్రోల్ ధర ఎంతంటే ? ...

2014లో అరెస్టయిన రాయ్‌ 2016 నుంచీ బెయిల్‌పై ఉన్నారు. అయితే, సహారా గ్రూప్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సెబీ తప్పుగా 15% వడ్డీని చేర్చిందని పేర్కొన్నారు. సహారా గ్రూప్‌ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి 3.5 బిలియన్‌ డాలర్లను చట్టవిరుద్ధంగా సమీకరించినట్లు 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

అయితే సహారా గ్రూప్‌ ఈ నిధులను తిరిగి చెల్లించకపోవడంతో గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌ను జైలుకి తరలించారు. ఏదేమైనా సుబ్రతా రాయ్ కేసు నెట్‌ఫ్లిక్స్ బాడ్ బాయ్ బిలియనీర్స్ సిరీస్‌లో చిత్రీకరించబడింది.

 ఇందులో ఆసియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (భారతదేశం) లో విఫలమైన / కుప్పకూలిపోయిన వ్యాపారవేత్తల (రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది) జీవిత చరిత్రను చూపించింది. మీడియా నివేదికలలో కోర్టు దాఖలు చేసిన కేసులలో రాయ్ ఇప్పటివరకు రూ .15 వేల కోట్లు కోర్టులో జమ చేసినట్లు సెబీ ప్రకటనలో తెలిపింది, అయితే ఈ కేసుపై తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుందో కోర్టు ఇంకా నిర్ణయించలేదు.
 

PREV
click me!

Recommended Stories

Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే