48 రోజుల తర్వాత వాహనదారులపై మళ్ళీ పెట్రోల్ ధరల సెగ.. నేడు లీటరు పెట్రోల్ ధర ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Nov 20, 2020, 12:31 PM IST
48 రోజుల తర్వాత వాహనదారులపై మళ్ళీ పెట్రోల్ ధరల సెగ.. నేడు లీటరు పెట్రోల్ ధర ఎంతంటే ?

సారాంశం

పెట్రోల్ ధర దేశ రాజధాని ఢీల్లీలో 17 పైసలు పెరిగి 81.23 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 22 పైసలు పెరిగి లీటరుకు 70.68 రూపాయలకు పెరిగింది. వ్యాట్ బట్టి ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి.

న్యూ ఢీల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు గత 48 రోజులు నిలకడను ప్రదర్శించిన తరువాత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి.

పెట్రోల్ ధర దేశ రాజధాని ఢీల్లీలో 17 పైసలు పెరిగి 81.23 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 22 పైసలు పెరిగి లీటరుకు 70.68 రూపాయలకు పెరిగింది. వ్యాట్ బట్టి ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి. రిటైల్ అమ్మకపు ధరలో దాదాపు మూడింట రెండు వంతుల వరకు పన్నులు ఉంటాయి.

 ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ పై 22 పైసలు పెరిగి రూ. 85.47కు చేరగా, డీజిల్‌ ధరలు 28 పైసలు పెరిగి రూ. 77.12ను చేరింది.

also read మునిగిపోతున్న లక్ష్మి విలాస్ బ్యాంక్ కథ.. గత 10 సంవత్సరాలలో 5 మంది సిఇఓలు మారారు.. ...

తాజాగా నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్‌ ధరలు ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 87.92కు చేరగా, డీజిల్‌ ధర రూ. 77.11ను తాకింది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 84.31ఉండగా, డీజిల్ ధర రూ. 76.17గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ. 82.79, డీజిల్‌ ధర రూ. 74.24కు చేరింది.

విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్‌ క్రూడ్‌ ధరలను ప్రభావితం చేస్తాయి.

వీటి ఆధారంగా చమురు పీఎస్‌యూలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తుంటాయి. సవరించిన ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్