Russia-Ukraine War:రష్యా అధ్యక్షుడి నిర్ణయాలతో పడిపోతున్న బిలియనీర్ల సంపద.. 4 రోజుల్లో 126 బిలియన్ల నష్టం..

Ashok Kumar   | Asianet News
Published : Feb 28, 2022, 12:07 PM ISTUpdated : Feb 28, 2022, 12:09 PM IST
Russia-Ukraine War:రష్యా అధ్యక్షుడి నిర్ణయాలతో పడిపోతున్న బిలియనీర్ల సంపద.. 4 రోజుల్లో 126 బిలియన్ల నష్టం..

సారాంశం

దేశంలోని బిలియనీర్లపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టుదల పెరుగుతోంది. రష్యా  ఉక్రెయిన్ మధ్య గత నాలుగు రోజుల యుద్ధంలో రష్యన్ బిలియనీర్లు  126 బిలియన్ల  డాలర్లకు పైగా నష్టాలను చవిచూశారు.

రష్యా దేశంలోని బిలియనీర్లపై  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టుదల పెరుగుతోంది. గత గురువారం వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశించిన సంగతి మీకు తెలిసిందే  అయితే అప్పటి నుండి రష్యా ధనవంతులకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. రష్యా ఉక్రెయిన్‌  రెండు దేశాల మధ్య యుద్ధం జరిగి నాలుగు రోజులు గడిచాయి. ఈ సమయంలో రష్యన్ బిలియనీర్లు 126 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ నష్టాలను చవిచూశారు. 

ధనికులకు పెద్ద విషయం
 ఉక్రెయిన్‌పై దాడి ప్రకటనతో స్టాక్ మార్కెట్‌ భారీగా పడిపోయింది. ఈ క్షీణత కారణంగా ఒక్క రోజులోనే రష్యన్ బిలియనీర్ల సంపదలో భారీ పతనం చోటు చేసుకుంది. ఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనే కాకుండా దాని ప్రభావంతో రష్యన్ కరెన్సీ రూబుల్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది ఇంకా ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది.  

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ దేశంలోని 13 మంది టాప్ బిలియనీర్లు హాజరయ్యారు. దీనికి సంబంధించి బయటకు వచ్చిన కథనం ప్రకారం.. ఈ భేటీలో పుతిన్ తనదైన శైలిలో కోటీశ్వరులతో మాట్లాడారని, ఆయన మాట్లాడిన మాటలపై స్పందించేందుకు ఏ కోటీశ్వరుడు సాహసించలేదన్నారు.  

116 మంది బిలియనీర్లు 
ఒక నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 16 నుండి రష్యా  ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా దేశంలోని 116 బిలియనీర్లు ఇప్పటివరకు  126 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు. ఈ యుద్ధం కొనసాగితే వారి సంపద మరింత క్షీణించవచ్చు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత రష్యా  MoX ఇండెక్స్ గురువారం 33 శాతం క్షీణించింది అలాగే  యూ‌ఎస్ డాలర్‌తో పోలిస్తే రూబుల్ రికార్డు స్థాయికి పడిపోయిందని ఒక నివేదిక పేర్కొంది. గురువారం ఒక్కరోజే రష్యా బిలియనీర్లు 71 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూడగా రష్యాలోని ఐదుగురు సంపన్నులైన అల్పెరోవ్, మిఖెల్సన్, మొర్దాషోవ్, పొటానిన్, కెరిమోవ్ ఎక్కువగా నష్టపోయారు. 

ఇతర దేశాల నుండి ఆంక్షల ప్రభావం
విశేషమేమిటంటే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు ప్రకటించాయి. యూ‌ఎస్, యూ‌కే సహా ఇతర పెద్ద దేశాలు విధించిన పరిమితుల కారణంగా పెట్టుబడిదారుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఇది షేర్ మార్కెట్‌ను పతనం రూపంలో నేరుగా ప్రభావితం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత, బ్రిటన్ రష్యా బ్యాంకుల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు, యూ‌కే బ్యాంక్ ఖాతాలలో 50,000 యూరోల కంటే ఎక్కువ  ఉన్న రష్యన్ పౌరులపై నిషేధాన్ని కూడా ప్రకటించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ప్రీమియర్ లీగ్ సాకర్ టీమ్ చెల్సియా ఎఫ్‌సి యజమాని, రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ సంపద కూడా బ్రిటిష్ ఆంక్షల కారణంగా భారీగా పడిపోయింది. 

షేర్ మార్కెట్ చరిత్రలో ఐదో భారీ పతనం,
పుతిన్  యుద్ద ప్రకటన తరువాత 24 గంటల్లో ఈ భారీ నష్టం దేశంలోని అత్యంత ధనవంతులను కదిలించింది. దీంతో పాటు ఈ యుద్దం ఎక్కువ కాలం కొనసాగితే మరింత నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిలో నెలకొంది. యుక్రెయిన్ పై రష్యా  దాడి సమయంలో గురువారం రష్యన్ స్టాక్ మార్కెట్ పతనం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఐదవ అతిపెద్ద పతనం. రష్యా బెంచ్‌మార్క్ MoX ఇండెక్స్ 33 శాతం వరకు ముగిసింది. 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 
స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో రష్యా కరెన్సీ రూబుల్ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. విశేషమేమిటంటే, స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ పతనం 1987 బ్లాక్ మన్ డే (monday)క్రాష్ తర్వాత అతిపెద్దది. బ్లాక్ మన్ డే నాడు పెట్టుబడిదారులు 50 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు. రష్యా స్టాక్ మార్కెట్‌లో ఈ భారీ పతనం ఆ దేశ స్టాక్ ఇండెక్స్ చరిత్రలో గడ్డు రోజులలో ఒకటి అని ఒక నివేదికలో పేర్కొంది. అదే సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరుగుతున్న గడ్డు కాలం కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్‌తో వివాదం కారణంగా, అమెరికాతో సహా ఎన్నో పెద్ద దేశాల నుండి రష్యా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో రష్యాలోని బిలియనీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది.

రష్యన్ బిలియనీర్లకు పెద్ద దెబ్బ
నివేదిక ప్రకారం, లుకోయిల్ ప్రెసిడెంట్ వాగిట్ అలెపెరోవ్ ఒక రోజులో అతిపెద్ద నష్టాన్ని చవిచూశారు, శనివారం మాత్రమే, అతని నికర విలువ ఒక రోజులో దాదాపు మూడింట ఒక వంతు పడిపోయింది. అంటే సుమారు 6.2 బిలియన్ల డాలర్లకు  తగ్గింది. మాస్కోకు చెందిన చమురు ఉత్పత్తిదారి షేర్లు గురువారం 33 శాతం వరకు పడిపోయాయి. దీని తరువాత, స్టీల్‌మేకర్ సెవెర్‌స్టాల్ ఛైర్మన్ అలెక్సీ మోర్దాషోవ్ గురువారం 4.2 బిలియన్ల డాలర్లను కోల్పోయారు, దీంతో అతని సంపద 23 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. దీని తరువాత, నోరిల్స్క్ నికెల్ అధ్యక్షుడు అలాగే ప్రస్తుతం రష్యాలో అతిపెద్ద సంపన్నుడైన వ్లాదిమిర్ పొటానిన్ 3 బిలియన్లడాలర్లను కోల్పోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు