Russia-Ukraine War: పుతిన్ పంతంతో రష్యన్ కుబేరులకు చిక్కులు, కళ్లముందే ఆవిరైపోతున్న రష్యా బిలియనీర్ల సంపద

Published : Mar 04, 2022, 05:03 PM ISTUpdated : Mar 04, 2022, 05:04 PM IST
Russia-Ukraine War: పుతిన్ పంతంతో రష్యన్ కుబేరులకు చిక్కులు, కళ్లముందే ఆవిరైపోతున్న రష్యా బిలియనీర్ల సంపద

సారాంశం

ఉక్రెయిన్‌పై దాడితో  రష్యన్ కుబేరుల ఆస్తులు మంచులా కరిగిపోతున్నాయి. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలతో రష్యా అనేక రంగాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే, రష్యన్ కంపెనీల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతుండగా, దీంతో వివిధ దేశాల్లో లిస్ట్ అయిన రష్యన్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.   

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై దాడి పై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం రష్యన్ కుబేరుల పాలిట శాపంగా మారింది. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలతో రష్యా అనేక రంగాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే, రష్యన్ కంపెనీల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతుండగా, దీంతో వివిధ దేశాల్లో లిస్ట్ అయిన రష్యన్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో  వివిధ దేశాల్లో బిలియనీర్లు భారీగా నష్టపోతున్నారు. రష్యన్ అల్ట్రా రిచ్  భారీ క్షీణత సంభవించింది.
 
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 500 సంపన్నులలో ఉన్న రష్యా బిలియనీర్ల మొత్తం సంపద ఇప్పటివరకు 83 బిలియన్ డాలర్లు పడిపోయింది. రష్యా స్టాక్ మార్కెట్ లోని భారీ క్షీణత దీనికి ప్రధాన కారణం. ఏకంగా మాస్కో స్టాక్ ఎక్స్ చేంజ్ ను నిలిపివేసింది.

లండన్‌ ఎక్స్‌చేంజ్ లోని రష్యా కంపెనీల క్యాపిటల్ 50 శాతం ఆవిరి...
అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాల నుంచి ఆల్ రౌండ్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లండన్‌లో లిస్టయిన రష్యా కంపెనీల షేర్లు 50 శాతానికి పైగా క్షీణించాయని నివేదిక పేర్కొంది. షేర్లు క్షీణించిన కంపెనీలలో గ్యాస్ ఉత్పత్తిదారు నోవాటెక్ నుండి ఉక్కు ఉత్పత్తి సంస్థ సెవర్స్టాల్ ఉన్నాయి.

ఈ బిలియనీర్లను కూడా నిషేధించారు
ఉక్రెయిన్‌పై దాడితో ఆగ్రహించిన యూరోపియన్ యూనియన్‌లో మెటల్ టైకూన్ అలిషర్ ఉస్మానోవ్, ఆల్ఫా గ్రూప్ యజమానులు మిఖాయిల్ ఫ్రిడ్‌మాన్, పీటర్ అవెన్ ఉన్నారు, అలాగే స్టీల్ మాగ్నెట్ అలెక్సీ మోర్దాషోవ్ నిషేధించిన వారి జాబితాలో ఉన్నారు. పుతిన్ దీర్ఘకాల ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, కొంతమంది సీనియర్ సైనిక అధికారుల ఆస్తులను కూడా ప్రభావితం చేసింది. యూకే ఆధారిత రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ ఫ్రిడ్‌మాన్, పీటర్ అవెన్ లు  హాలండ్ & బారెట్‌ కు చెందిన లెటర్‌వన్‌లో సంస్థలో  22 బిలియన్ల  వాటాలను కలిగి ఉన్నారు,  ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత EU ఆంక్షలతో వీటిని "స్తంభింపజేయబడిన" జాబితాలో చేర్చారు.

LetterOne ఒక ప్రకటనలో తెలియజేస్తూ తమ సంస్థలో లో వాటాలు కలిగి ఉన్న మిఖాయిల్ ఫ్రిడ్‌మాన్, పీటర్ అవెన్ ఇక "కంపెనీతో ఎటువంటి ప్రమేయాన్ని లేకుండా" నిశేధించామని,  వారి షేర్లను స్తంభింపజేసినట్లు  ప్రకటించింది.

ఈ బిలియనీర్ల సంపదకు నష్టం
>> Lukoil PJSC చైర్మన్ వాగిత్ అలెక్పెరోవ్ నికర విలువ సుమారు 13 బిలియన్లు తగ్గింది.
>>  గెన్నాడి టిమ్‌చెంకో సంపద 10.6 బిలియన్ డాలర్లు తగ్గింది.
>>  నోవాటెక్ వాటాదారు లియోనిడ్ మిఖేల్సన్ 10.2 బిలియన్లను కోల్పోయారు.
>>  అబ్రమోవిచ్ సుమారు  5 బిలియన్ల నష్టాన్ని చవిచూశాడు.
>>  ఇది కాకుండా, అనేక ఇతర రష్యన్ బిలియనీర్ల సంపద కూడా గణనీయంగా పడిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?