
Applictation Invited for NSE MD-CEO: ప్రపంచంలోని అతిపెద్ద ఇండెక్స్‌లలో ఒకటిగా ఉన్న దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక్స్ NSE ప్రస్తుత MD, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవీకాలం జూలైలో ముగియనుంది. ఎక్స్ఛేంజ్ కొత్త MD, CEO కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం విడుదల చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, NSE IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లో అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది.
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు NSE MD & CEO కోసం తమ CVని మార్చి 25 సాయంత్రం 6 గంటలలోపు nse.mdceo@komferry.comకి పంపవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది
ఈ గడువు తర్వాత, నామినేషన్లు మరియు రెమ్యునరేషన్ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. NSEచే ఏర్పాటు చేయబడిన ఎంపిక కమిటీ అభ్యర్థుల పేర్లను బోర్డుకి సిఫారసు చేస్తుంది, ఆ తర్వాత పేర్లు తుది ఆమోదం కోసం SEBIకి పంపుతారు. ప్రస్తుత ఎన్‌ఎస్‌ఈ చీఫ్ విక్రమ్ లిమాయే పదవీకాలం ఈ ఏడాది జూలైతో ముగియనుంది. లిమాయే రెండవ పర్యాయం కోసం కూడా పదవిని పొందవచ్చు కానీ దీని కోసం కూడా అతను మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నిబంధనల ప్రకారం ఇతర అభ్యర్థులతో పోటీ పడవలసి ఉంటుంది.
నిజానికి ప్రస్తుత MD మరియు CEO విక్రమ్ లిమాయే పదవీకాలం జూలైలో ముగియనుంది. చిత్రా రామకృష్ణ నిష్క్రమణ తర్వాత 2017 జూలైలో లిమాయే నియమితులయ్యారు. లిమాయే హయాంలో, కంపెనీ దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. కానీ చిత్రా రామకృష్ణ హయాంలో జరిగిన కలోకేషన్ స్కామ్ (colocation scam), కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి. దీంతో సంస్థ చిక్కుకుంది. దీన్నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది.
NSE MD-CEO పదవి కోసం అర్హత ప్రమాణాలు
>> కాపిటల్, సెక్యూరిటీస్, ఫైనాన్షియల్ మార్కెట్ల వివిధ అంశాలలో కనీసం 25 సంవత్సరాల అనుభవం.
>> కనీసం ఐదేళ్ల నాయకత్వ అనుభవం. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో సీఈఓగా పనిచేసిన అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
>> దేశీయ మరియు ప్రపంచ మార్కెట్ కదలికలపై సమాచారం.
>> అభ్యర్థి కార్పొరేట్ గవర్నెన్స్, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలని పేర్కొంది.
>> అభ్యర్థులు పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీలో పనిచేసిన అనుభవం లేదా IPO ప్రక్రియలో పాలుపంచుకున్న సంస్థకు నాయకత్వం వహించిన అనుభవం ఉన్నవారికి "అదనపు ప్రయోజనం" ఉంటుందని నోటీసు పేర్కొంది.